తెలంగాణ

telangana

ETV Bharat / state

పెద్దల నిర్లక్ష్యం.. తీసింది బాలుడి ప్రాణం - chilakalaguda

సికింద్రాబాద్​ చిలకలగూడ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ పురాతన ఇంటి పైకప్పు కూలింది. ఈ ఘటనలో బాలుడు అక్కడిక్కడే మృతి చెందగా... మరొకరికి తీవ్రగాయలయ్యాయి. గాయలపాలైనా బాలుడి తల్లి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

పెద్దల నిర్లక్ష్యం.. తీసింది చిన్నారి ప్రాణం...

By

Published : Jul 21, 2019, 4:55 PM IST

ఇంటి పైకప్పు కూలి బాలుడు చనిపోయిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో బాలుడి తల్లికి తీవ్ర గాయలయ్యాయి. ఆమెను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. పురాతన ఇల్లు కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా మట్టి కుప్పలు బాలుడిపై పడడం వల్ల అక్కడికక్కడే మృతిచెందాడని బాలుడి బాబాయ్​ తెలిపారు. ప్రస్తుతం చిన్నారి కుటుంబ సభ్యులు ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు చెప్పారు.

ఘటనా స్థలాన్ని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్, స్థానిక కార్పొరేటర్ హేమ పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనలో బాలుడు మృతి చెందటం బాధకరమన్నారు. పాత భవనాలకు నోటీసులు ఇచ్చినప్పటికీ ప్రజలు కోర్టుకు వెళ్లి... వాటిలోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారని రవికుమార్​ అన్నారు.

బాలుడు చనిపోయిన ఇంటికి మరొక ఇల్లు అనుకొని ఉండడం వల్లనే ఈ ఘటన జరిగిందని రవి కుమార్ తెలిపారు. చనిపోయిన బాలుడి కుటుంబానికి నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పురాతన భవనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... వీలైనంత త్వరగా వాటిని ఖాళీ చేయాలని డిప్యూటీ కమిషనర్​ సూచించారు.

పెద్దల నిర్లక్ష్యం.. తీసింది చిన్నారి ప్రాణం...
ఇదీ చూడండి: అధికారుల నిర్లక్ష్యంతో... ప్రభుత్వ ఆదాయానికి గండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details