గవర్నర్ నరసింహన్ ఎప్పటికప్పుడు తనను వెన్నుతట్టి, ధైర్యం చెబుతూ స్ఫూర్తి నింపేవారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్త రాష్ట్రం ప్రస్థానం పూర్తిగా తెలిసిన వ్యక్తి నరసింహన్ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవీ బాధ్యతలు చేపట్టిన నరసింహన్... ఉద్యమాన్ని అణచివేయడానికే వచ్చారనే భయం ఉండేదని... కానీ ఉద్యమ నేపథ్యాన్ని ఆసక్తిగా అడిగి తెలుసుకున్న అనంతరం... స్వరాష్ట్ర ఉద్యమం, ప్రజల డిమాండ్ గురించి కేంద్రానికి సరైన నివేదికలే పంపుతారని విశ్వసించానని నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. ఆయన హయాంలో ఉద్యమకారుడిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు.
గవర్నర్ నన్ను తమ్ముడిలా ఆదరించారు: సీఎం - governer
గవర్నర్ నరసింహన్ సేవలు కోల్పోవడం అత్యంత బాధగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నరసింహన్తో తనకున్న అనుభవాలను సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.
గవర్నర్ నన్ను తమ్ముడిలా ఆదరించారు: సీఎం
ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగాధిపతిగా పనిచేసిన ఆయన అనుభవం విధినిర్వాహణలో ఎంతగానో ఉపయోగపడిందన్నారు. గవర్నర్ నరసింహన్ తననెప్పుడూ ముఖ్యమంత్రిలా కాకుండా ఓ తమ్ముడిలా ఆదరించాడని ఆయనతో గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రాజ్భవన్లో ప్రతి పండుగను గవర్నర్ దంపతులు దగ్గరుండి మరీ వైభవంగా నిర్వహించేవారని పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు.
ఇదీ చూడండి: బేగంపేటలో గవర్నర్‌కు సీఎం ఘనంగా వీడ్కోలు..
Last Updated : Sep 7, 2019, 8:00 PM IST