తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర బృందం.. కరీంనగర్‌లో పర్యటించి అక్కడి సమస్యలు తెలుసుకోవాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ కోరారు. కరోనా కారణంగా కరీంనగర్‌లో ఏర్పడ్డ ఇబ్బందులు, రైతులు, దినసరి కూలీలు, వలస కార్మికుల సమస్యలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర బృందం కరీంనగర్‌లో పర్యటించాలి: పొన్నం - ponnam prabhakar
కేంద్ర ప్రత్యేక బృందం కరీంనగర్‌లో క్షేత్ర స్థాయిలో పర్యటించి.. అక్కడి సమస్యలను తెలుసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ కోరారు. ఇందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చొరవ చూపాలని విజ్ఞుప్తి చేశారు.
కేంద్ర బృందం కరీంనగర్‌లో పర్యటించాలి: పొన్నం
ఉత్తర తెలంగాణలో సమస్యలు తెలుసుకునేందుకు కేంద్ర బృందం కరీంనగర్‌లో క్షేత్ర స్థాయిలో పర్యటించాలని.. ఇందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చొరవ చూపాలని పొన్నం కోరారు.
ఇదీ చూడండి:పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ