తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ ఏర్పాటు తర్వాత గణనీయంగా అప్పులు పెరిగాయన్న కేంద్రం

Telangana Debts
Telangana Debts

By

Published : Feb 13, 2023, 2:05 PM IST

Updated : Feb 13, 2023, 2:30 PM IST

14:03 February 13

తెలంగాణ ఏర్పాటు తర్వాత గణనీయంగా అప్పులు పెరిగాయన్న కేంద్రం

Increased Telangana Debts: తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్రం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయన్న కేంద్రం... 2022 అక్టోబర్‌ నాటికి 4 లక్షల 33 వేల కోట్ల అప్పు ఉన్నట్లు వెల్లడించింది. లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్‌ అడిగిన ప్రశ్నకు లోకసభలో లిఖితపూర్వకంగా కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి సమాధానమిచ్చారు.

తెలంగాణ ఆవిర్భావం నాటికి 75వేల 577 కోట్ల అప్పులున్నాయన్న కేంద్రం... 2021-22 నాటికి అవి 2లక్షల 83వేల కోట్లకు చేరాయని తెలిపింది. ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు లక్షా 50వేల కోట్లు అప్పు తీసుకున్నట్లు వెల్లడించింది. 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు లక్షా 30వేల కోట్లని తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని కేంద్ర ఆర్ధిక శాఖ వివరాలు వెల్లడించింది. 2022 అక్టోబర్‌ నాటికి తెలంగాణ మొత్తం అప్పులు... రూ. 4,33,817.6 కోట్లు ఉన్నట్లు తెలిపింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం చేసిన అప్పులు ఇలా ఉన్నాయి.

  • 2014-15లో రూ. 8,121 కోట్లు
  • 2015-16లో రూ. 15,515 కోట్లు
  • 2016-17లో రూ. 30,319 కోట్లు
  • 2017-18లో రూ. 22,658 కోట్లు
  • 2018-19లో రూ. 23,091 కోట్లు
  • 2019-20లో రూ. 30,577 కోట్లు
  • 2020-21లో రూ. 38,161 కోట్లు
  • 2021-22లో రూ. 39,433 కోట్లు

ఇవి కాకుండా... రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు కేంద్ర ఆర్ధిక శాఖకు నివేదించాయి. రూరల్‌ ఇన్ఫ్రాస్టక్చర్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి రూ. 8,871 కోట్లు మంజూరు కాగా... రూ. 7,144 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. వేర్‌ హౌస్‌ ఇన్ఫ్రాస్టక్చర్‌ ఫండ్‌ నుంచి రూ. 972 కోట్లు మంజూరు కాగా... రూ. 852 కోట్లు విడుదల చేశారని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఫండ్‌ నుంచి 2015-16, 2016-17లో రూ. 28 కోట్లు మంజూరు కాగా... రూ. 10 కోట్లు విడుదల అయ్యాయని పేర్కొంది. నబార్డ్‌ ఇన్ఫ్రాస్టక్చర్‌ డవలప్‌మెంట్‌ అసిస్టెన్స్‌ నుంచి... వివిధ పథకాల అమలు కోసం... రూ. 14,516.65 కోట్లు మంజూరు కాగా... ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,424.66 కోట్లు వినియోగించుకున్నట్లు కేంద్రం తెలిపింది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 13, 2023, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details