స్టైరీన్ ట్యాంకుల నిర్వహణలో అడుగడుగునా చోటు చేసుకున్న లోపాలే ఏపీ విశాఖలో దారుణ విషాదానికి దారి తీశాయని హై పవర్ కమిటీ తేల్చింది. ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం నియమించిన 9మంది సభ్యుల హై పవర్ కమిటీ సీఎం జగన్‌కు నివేదిక సమర్పించింది.
విశాఖ గ్యాస్ లీక్‌లో యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం: హైపవర్ కమిటీ - విశాఖ ఎల్జీ ఘటన పై హైపవర్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై నియమించిన హైపవర్ కమిటీ సీఎం జగన్‌ను కలిసి నివేదిక సమర్పించింది. స్టైరీన్ ట్యాంకుల నిర్వహణలో అడుగడుగునా చోటు చేసుకున్న లోపాలే ఈ ఘటనకు కారణమని హైపవర్ కమిటీ తెలిపింది.
విశాఖ గ్యాస్ లీక్‌లో యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం
ప్రతి సాంకేతిక అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించడం సహా, ప్రమాదంపై ప్రజలు లేవనెత్తిన ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇచ్చేందుకు నివేదికలో ప్రయత్నించామని కమిటీ ఛైర్మన్ నీరబ్‌కుమార్ అన్నారు. ట్యాంకులో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగి, ఆవిరైన స్టైరీన్ వాతావరణంలో కలిసేందుకు దారి తీసిందని వివరించారు. ప్రమాదం జరిగాక అత్యవసర స్పందన వ్యవస్థ సైతం దారుణంగా విఫలమైందన్నారు.