రాష్ట్ర గవర్నర్‌పై తెరాస నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా హైదరాబాద్ గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం ముందు భాజపా మహిళా మోర్చా ఆందోళన నిర్వహించింది. హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డితో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్‌కు క్షమాపణ చెప్పాలని మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ వ్యాపి చెందకుండా ప్రజలను కాపాడడానికి తీసుకోవాల్సిన చర్యలలో తన తప్పిదాలను గుర్తించకుండా... గవర్నర్‌పై తెరాస నాయకులు భాజాపా రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోందని మాట్లాడటం సరికాదన్నారు.