గ్రీకు భాషలో తలసా అంటే సముద్రం. హీమా అంటే రక్తం. రెండూ కలిపితేనే తలసేమియా. పసిబిడ్డల ప్రాణాలతో చెలగాటమాడుతున్న భయంకరమైన వ్యాధి. రక్తాన్ని జలగలాగా పీల్చేస్తుంది. ఇది పుట్టుకతో వచ్చే జన్యుపరమైన వ్యాధి. జబ్బు తీవ్రతని బట్టి రెండు లేదా మూడు వారాలకోసారి రక్తం ఎక్కించుకోవడం తప్ప పరిష్కారం లేని రోగం. ఎన్నాళ్లు ఇలా రక్తం మార్పిడి చేయాలంటే ఏ వైద్యుడి దగ్గర సరైన సమాధానం దొరకదు. ఎండకాలంలో ఈ బిడ్డల పరిస్థితి చాల దారుణంగా ఉంటుంది. రక్తదానం చేయటానికి చాలా మంది ముందుకు రాకపోవటమే ఇందుకు కారణం.
తలసేమియా అంటే ఏంటి?
తలసేమియా అనేది జన్యు సంబంధమైన వ్యాధి. పసిపిల్లల పాలిట శాపంగా మారింది. దురదృష్టం ఏమిటంటే ప్రాణంపోసే కన్నవారి ద్వారే ఈ ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తుంది. అంతే కాదు వంశపారంపర్యంగానూ వస్తుంది. తల్లిదండ్రులు తలసేమియా వాహకులైతే పుట్టపోయే బిడ్డల్లో పాతిక శాతం పుట్టుకతోనే వ్యాధిగ్రస్థులయ్యే(తలసేమియా మేజర్) అవకాశం ఉంది. మరో 50 శాతం కేవలం వాహకులుగానే (తలసేమియా మైనర్) మిగిలిపోవచ్చు. మిగతా 25 శాతం సంపూర్ణ ఆరోగ్యంగా జన్మించే అవకాశం ఉంది.
వ్యాధి లక్షణాలు...
తలసేమియా ప్రభావం ఎక్కువగా రక్తంపై పడుతుంది. మనం పీల్చుకునే ప్రాణవాయువుని శరీరంలోని ప్రతి భాగానికి అందించే బాధ్యత హిమోగ్లోబిన్‌దే. ఇంతటి ప్రాముఖ్యత ఉన్నా హిమోగ్లోబిన్ ఈ వ్యాధిగ్రస్థుల శరీరంలో అవసరం మేర ఉత్పత్తి కాదు. ఫలితంగా హిమోగ్లోబిన్ నిల్వ సాధారణ స్థాయి కన్నా తక్కువకి పడిపోయిన ప్రతి సారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. సరైన సమయానికి రక్తం ఎక్కించకపోతే పిల్లలు రోజురోజుకి బలహీన పడుతుంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను సైతం తట్టుకొలేరు. మెుహం పాలిపోతుంది. రక్తం ఎక్కించే విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా ఒక్కోసారి బిడ్డ ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
దేశవ్యాప్తంగా మెుత్తం జనాభాలో దాదాపు 3 నుంచి 5శాతం మంది తలసేమియా వాహకులుగా ఉన్నారని తలసేమియా నివారణ కోసం పోరాటం చేస్తున్న స్వచ్ఛంద సేవకులు చెప్తున్నారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం పదివేల మంది... రాష్ట్రంలో అయితే వెయ్యి మంది చిన్నారులు ఈ వ్యాధితో జన్మిస్తున్నారు.
ఐరన్‌తో అయోమయ పరిస్థితి...