హైదరాబాద్ పాతబస్తీలోని బోనాల ఉత్సవ ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పాతనగర ఉమ్మడి దేవాలయాల కమిటీ, వివిధ ఆలయాల కమిటీ సభ్యులు, వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిసి చారిత్రాత్మక దేవాలయాలను సందర్శించారు. అనంతరం ఉప్పుగూడా అండర్ రైల్వే బ్రిడ్జి పనులను పరిశీలించారు. అమ్మవారి ఘటాలు ఉప్పుగూడా అండర్ రైల్వే బ్రిడ్జి గుండా ప్రస్తుతానికి వెల్లవచ్చని, పనులు పూర్తయ్యాక మరోసారి ప్రారంభోత్సవ కార్యక్రమం జరుపుతామని తలసాని స్పష్టం చేశారు.
ఛత్రినాక పోతలింగన్న స్వామి దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయంతో పాటు పలు ఆలయాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.
బోనాల ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన తలసాని - thalasani visited bonalu arrangements
పాతబస్తీలో జరుగుతున్న బోనాల ఉత్సవ ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
బోనాల ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన తలసాని
TAGGED:
thalasani