ETV Bharat / state
మా ఆదేశాలే ధిక్కరిస్తారా? - ఉన్నతాధికారుల అరెస్టు
మాజీ శాసన సభ్యులు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వం రద్దు విషయంలో అధికారుల హైకోర్టు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను అవమానించారంటూ ఏజీపై తీవ్ర స్థాయిలో మండిపడింది. మాజీ సభాపతికి మరోసారి నోటీసులు జారీ చేసింది.
శాసన సభ్యుల రద్దు వ్యవహాం
By
Published : Feb 15, 2019, 12:57 PM IST
| Updated : Feb 16, 2019, 11:09 AM IST
అసెంబ్లీ, న్యాయ కార్యదర్శులపై ఆగ్రహం అసెంబ్లీ, న్యాయ కార్యదర్శులపై ఆగ్రహం కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రెడ్డి నేడు ఉన్నత న్యాయస్థానం ముందు హాజరయ్యారు. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వం రద్దు వ్యవహారంపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఇరువురిని అదుపులోకి తీసుకోవాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేసింది. రూ. 10 వేల చొప్పున పూచీకత్తు సమర్పించిన తర్వాతే విడిచిపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టును అవమానించేలా వ్యవహరించారంటూ అదనపు ఏజీ రామచంద్రరావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, డీజీపీ, నల్గొండ, గద్వాల ఎస్పీలకు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ప్రతివాదిగా చేర్చిన కోర్టు.. తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది. Last Updated : Feb 16, 2019, 11:09 AM IST