తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాసకు ప్రత్యామ్నాయం దిశగా కమలం అడుగులు..!

రాష్ట్రంలో వరుస వలసలతో కాంగ్రెస్ కాకవికలం అయితుంటే... చేరికలతో కాషాయంలో జోష్ పెరుగుతోంది. తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా అనే దిశగా కమలం నేతలు అడుగులు వేస్తున్నారు. సంస్థాగతంగా బలపడేందుకు తెలంగాణ భాజపా నేతలు ముందుకు సాగుతున్నారు.

trs-bjp

By

Published : Apr 1, 2019, 4:00 PM IST

Updated : Apr 1, 2019, 5:16 PM IST

తెరాసకు ప్రత్యామ్నాయం దిశగా కమలం అడుగులు..!
తెలంగాణ భాజపాలో వరుస చేరికలతో కమలం వికసించే దిశగా అడుగులు వేస్తోంది. గులాబీకి ప్రత్యామ్నాయం కమలం అనే స్థాయికి చేరేలా అగ్రనేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని పార్టీల్లోని అసంతృప్తనేతలను ఆకర్షించి అక్కున చేర్చుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

వికసిస్తున్న కమలం...
ఇప్పటికే కాంగ్రెస్​ నుంచి సీనియర్ నేతలు డీకే అరుణ, తెరాస లోక్​సభాపక్ష నేత జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి కమలం గూటికి చేరారు. తాజాగా మాజీ మంత్రి విజయరామరావు సైతం కాషాయ జెండా కప్పుకొనబోతున్నారనే ముచ్చట వినిపిస్తోంది.మెుదటి నుంచి తెరాసపై ఒంటి కాలుమీద లేచే నేతలతో పాటు మరికొంత మంది రాష్ట్రస్థాయి నేతలు వీరి బాటలోనే నడిచే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికిసంస్థాగతంగా బలపడే దిశగా కమలం అడుగులు వేస్తోంది.

పాలమూరు పార్లమెంట్​పై కన్నేసిన కమలం...

లోక్​సభ ఎన్నికల్లో కనీసం రెండు నుంచి మూడు స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా భాజపా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఇటీవలే పార్టీలో చేరిన డీకే అరుణకు పాలమూరు నుంచి అవకాశం కల్పించింది.​ ఆమెకు తోడు అదే జిల్లాకు చెందిన తెరాస లోక్​సభాపక్ష నేత జితేందర్ రెడ్డి చేరడం కాషాయ దళంలో జోష్​ పెరిగింది.రాజకీయలకు కొత్తైన వ్యాపారవేత్త మన్నే శ్రీనివాస్ రెడ్డిని తెరాస బరిలోకి దింపింది. శ్రీనివాస్ రెడ్డి గద్వాల జేజమ్మను ఎదుర్కొనగలరా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

అలాగే సికింద్రాబాద్​లోను అదే పరిస్థితి కనిపిస్తోంది. భాజపా నుంచి సీనియర్ నేత కిషన్​ రెడ్డి బరిలోకి దిగగా , తెరాస మాత్రం తలసాని తనయుడిని పోటీకి దింపింది. నిజామాబాద్​లో రైతులను ఆకర్షించేందుకు ఏకంగా కేంద్రంలో అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్​మాధవ్ ప్రకటించారు. ఇక్కడ డీఎస్ తనయుడు ధర్మపురి అర్వింద్​ను రంగంలోకి దింపారు. అర్వింద్ సామాజిక వర్గం, సంస్థాగతంగా పార్టీ బలంగా ఉండటంతో పాటు పసుపు బోర్డు ప్రకటన కలిసివస్తుందని కమలదళం నేతలు ఆశతో ఉన్నారు.

కేంద్రంలో మళ్లీరాబోయేది తమ ప్రభుత్వమే అని కమల నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే... తెరాస సైతం ఈసారి దిల్లీలో ప్రధాన మంత్రిని నిర్ణయించేది ప్రాంతీయ పార్టీలేననిపలు ప్రచార సభల్లో కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్​ ఎన్నికల ఫలితాలు కమలానికి అనుకూలంగా వస్తే...రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది.

ఇవీ చూడండి:తెలంగాణలో మంత్రులకు లోక్​సభ పరీక్ష...!

Last Updated : Apr 1, 2019, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details