Lokesh Padayatra: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా బంగారుపాళ్యంలో లోకేశ్ సభ జరుగుతోంది. దీంతో పోలీసులు భారీ ఎత్తున అక్కడకు చేరుకుని..బహిరంగ సభకు అనుమతి లేదని లోకేశ్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మరోవైపు బహిరంగసభకు అనుమతి ఇవ్వాలని టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. మరోవైవు పోలీసులు లోకేశ్ మూడు వాహనాలు సీజ్ చేశారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇదేవిధంగా సభకు అనుమతి లేదని నిన్న లోకేశ్ ప్రచారరథాన్ని పోలీసులు ఆపారు. లోకేశ్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో నోటీసులిచ్చారు. లోకేశ్ సభాస్థలానికి రావటానికి ముందు పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. లోకేశ్ సభను నిర్వహంచకుండా ఉండేందుకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. పోలీసుల అడ్డంకుల్ని దాటుకుని లోకేశ్ సభ నిర్వహించారు. పోలీసుల అడ్డంకుల్ని దాటుకుని వెళ్లటమే కాకుండా.. కార్యకర్తల సహకారంతో ఓ భవనంలోకి వెళ్లి ప్రసంగించారు. ఆ ప్రాంతంలో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.