తెలంగాణ

telangana

ETV Bharat / state

'మంత్రి హామీతో తాత్కాలికంగా ఆందోళన విరమిస్తున్నాం' - Hyderabad latest news

తాత్కాలిక ఉపాధ్యాయులు తమ ఆందోళనను విరమించారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి హామీతో విరమిస్తున్నట్లు తెలిపారు. సర్వీసులను పునరుద్ధించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

Temporary teachers withdrew their concern on Temporary
తాత్కాలిక ఉపాధ్యాయుల ఆందోళన విరమణ

By

Published : Feb 18, 2021, 9:20 PM IST

పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద గత నాలుగు రోజులుగా శాంతియుత ఆందోళన చేస్తున్న తాత్కాలిక ఉపాధ్యాయులు తమ ఉద్యమం తాత్కాలికంగా విరమించారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి హామీతో నిరసన విరమిస్తున్నట్లు కళా, వృత్తి, వ్యాయామ టీచర్ల సంఘం ఉపాధ్యక్షురాలు రైస్‌ ఫాతిమా తెలిపారు.

సబితాఇంద్రారెడ్డితో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అపాయింట్‌మెంట్‌ ఇప్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు సంఘం ప్రతినిధులు వెల్లడించారు.

మూడు రోజుల తరువాత తమ సర్వీసులను పునరుద్ధించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సీఎం సానుకూలంగా స్పందిచి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:వేతనాలు చెల్లించాలని నిజాం షుగర్​ కార్మికుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details