తెలంగాణ

telangana

ETV Bharat / state

పగలు భానుడి భగభగలు.. రాత్రి చలిగాలులు

రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రత సాధారణంకన్నా 4 డిగ్రీల వరకూ తక్కువగా ఉంటోంది. ఈ నెల 19 వరకూ ఇలాగే వాతావరణంలో మార్పులుంటున్నారు వాతావరణశాఖ అధికారులు.

రోజురోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రత
రోజురోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రత

By

Published : Mar 15, 2021, 7:12 AM IST

వేసవి పూర్తిగా రాకముందే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం అత్యధికంగా మణుగూరు (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)లో 39.2, ఏన్కూరు (ఖమ్మం)లో 38.7, కన్నెపల్లి (మంచిర్యాల)లో 38.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఆగ్నేయ భారతం నుంచి తేమ గాలులు రావడం, ఉత్తర భారతంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపుల కారణంగా తెలంగాణలో తేమ శాతం పెరిగి చలి వాతావరణమేర్పడినట్లు వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతలుంటున్నందున పొడి వాతావరణ మేర్పడింది. ఈ నెల 19 వరకూ ఇలాగే వాతావరణంలో మార్పులుంటాయన్నారు.

ఇదీ చూడండి:ఓఆర్ఆర్‌పై రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details