తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో తగ్గుతున్న ఉష్టోగ్రతలు - హైదరాబాద్​ తాజా వార్తలు

తెలంగాణ ఉష్టోగ్రతలు తగ్గుతున్నాయి. సాధారణంకన్నా 4 డిగ్రీల వరకూ తక్కువగా ఉంటున్నాయి. తూర్పు, ఈశాన్య భారతం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో పగలు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.

temperatures decreasing in telangana
రాష్ట్రంలో తగ్గుతున్న ఉష్టోగ్రతలు

By

Published : Feb 25, 2021, 7:37 AM IST

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 4 డిగ్రీల వరకూ తక్కువగా ఉంటున్నాయి. బుధవారం అత్యల్పంగా కోహీర్‌(సంగారెడ్డి)లో 11.5, పిట్లం(కామారెడ్డి)లో 11.6, సిర్పూరు(కుమురం భీం)లో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో బుధవారం పగలు 32 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.

తూర్పు, ఈశాన్య భారతం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో పగలు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఉదయం పూట కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. గాలిలో తేమ సాధారణంకన్నా 24 శాతం అదనంగా ఉంటోంది.

ఇదీ చదవండి:ఎంఎస్​ఎన్ ఫార్మాపై రెండో రోజూ ఐటీ దాడులు

ABOUT THE AUTHOR

...view details