తూర్పు భారత్ నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్న తేమగాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం సాధారణం కన్నా 4 డిగ్రీల వరకు అదనంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో రాత్రిపూట చలి ప్రభావం పెద్దగా లేదు. సోమ, మంగళవారాల్లోనూ ఇదే తరహా పరిస్థితి కొనసాగే అవకాశాలున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు మహబూబ్‌నగర్‌లో 22.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
తేమ గాలుల ప్రభావం.. చలి నుంచి కాస్త ఉపశమనం - తెలంగాణలో తగ్గిన చలి తీవ్రత
తేమ గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో 3.1 కి.మీ మేర ఉపరితల ద్రోణి ఏర్పడటంతో తూర్పు భారత్ నుంచి రాష్ట్రంలోకి తేమ గాలులు వీస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం సాధారణం కంటే 4 డిగ్రీలు వరకు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజుల పాటు ఇదే తరహా పరిస్థితులు కొనసాగనున్నాయి.
తేమ గాలుల ప్రభావంతో రాష్ట్రంలో తగ్గిన చలి తీవ్రత
మరోవైపు శ్రీలంక సమీపంలోని కోమరీన్ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ తీరం వరకు బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తూర్పు భారత్ నుంచి రాష్ట్రంలోకి తేమగాలులు వీస్తున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో అత్యల్పంగా 15.9, సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 14.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇదీ చదవండి:ఆహార పదార్థాలతో అన్నకుటోత్సవాలు