Omicron suspected woman : లండన్ నుంచి బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో హైదరాబాద్ వచ్చిన ఓ మహిళకు నగరంలో చేదు అనుభవం ఎదురైంది. ఒమిక్రాన్ అనుమానంతో పోలీసులు, ఇతర సిబ్బంది తనను వేధించినట్లు ఆమె పేర్కొన్నారు. తొలుత కరోనా నెగిటివ్ అని, గంటలోనే పాజిటివ్ అని చెప్పి.. ఇంట్లోకి అడుగుపెట్టనీయకుండా బెదిరించారని వాపోయారు. యంత్రాంగం తప్పులకు తాను, తన కుటుంబం తీవ్ర మనోవ్యథను ఎదుర్కొంటున్నట్లు ఆ మహిళ ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు తెలిపారు.
అయిదేళ్ల పాపతో గంటల నిరీక్షణ
నవంబరు 30 సాయంత్రం లండన్‌లో నా కుమార్తెతో బయల్దేరా. అక్కడ విమానాశ్రయంలో కొవిడ్ నెగెటివ్ ఆర్‌టీపీసీఆర్ ధ్రువపత్రం తీసుకున్న తర్వాత.. పరీక్షలన్నీ చేసి 4 గంటలు ఆలస్యంగా విమానం ఎక్కించారు. శంషాబాద్ విమానాశ్రయంలో డిసెంబరు 1న ఉదయం దిగగానే పరీక్షలు చేయాలన్నారు. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లో వచ్చిన వారితో పాటు ఇతరులు 200 మందిని భౌతికదూరం పాటించకుండా ఒక వరుసలో గంటల తరబడి నిలబెట్టారు. 45 నిమిషాల్లో పరీక్ష ఫలితం కావాలంటే రూ.4,500 కట్టాలన్నారు. ఇబ్బంది పడుతున్న పాపతో నిరీక్షించలేక రూ.4,500 చెల్లించా. 2 గంటల తర్వాత ఫలితం నెగెటివ్ అని చెప్పారు. రిపోర్టు మెయిల్ చేస్తామన్నాక జీడిమెట్లలోని ఇంటికి బయల్దేరా. గంట తర్వాత పాజిటివ్ అంటూ ఇంకో మెయిల్ పంపారు.
టాయిలెట్‌కూ వెళ్లనివ్వలేదు..