Minister Harish on HC: కరోనా ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తామని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు ఉత్తర్వుల కాపీ ఇంకా అందలేదని... ఆర్డర్ కాపీ అందిన తరువాత మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. హైదరాబాద్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
బూస్టర్ డోసు సూచిస్తున్నా కేంద్రం స్పందించట్లేదు: హరీశ్‌రావు కేంద్రంతో చర్చిస్తాం
ఒమిక్రాన్ కట్టడికి ఇప్పటికే పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి... విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. బూస్టర్ డోస్, పిల్లల టీకాపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదన్నారు. టీకాలు, కొవిడ్ కట్టడి చర్యలపై త్వరలో కేంద్రంతో చర్చిస్తామని చెప్పారు.
హైకోర్టు తీర్వు ఉత్తర్వులు ప్రభుత్వానికి ఇంకా రాలేదు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తాం. ఆర్డర్ కాపీ అందిన వెంటనే మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంటుంది. కొవిడ్ మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బూస్టర్ డోస్, పిల్లల టీకాపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. బూస్టర్ డోసు సూచిస్తున్నా కేంద్రం స్పందించట్లేదు. ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో త్వరలోనే చర్చిస్తాం. విదేశాల నుంచే ప్రతి ఒక్కరికీ ఒమిక్రాన్ టెస్టులు నిర్వహిస్తున్నాం.-హరీశ్ రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
ఇక నుంచి ప్రతి నెలా
ఆయుష్మాన్ భారత్‌ను ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేశామన్న హరీశ్.. అవకాశం ఉంటే దుర్గాభాయ్ ఆస్పత్రికి కూడా విస్తరిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆరోగ్య శ్రీ బిల్లులు ప్రతి నెలా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆస్పత్రులపై మెగా సంస్థ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని.. రూ.18 కోట్లతో నిమ్స్‌లో సదుపాయాలు కల్పించిందని వివరించారు. రోజుకు 35 లక్షల లీటర్ల ఆక్సిజన్‌ను మెగా సంస్థ ప్రభుత్వానికి అందించిందని వెల్లడించారు.
ఇదీ చదవండి:f2f with Rajarao On Genome Sequencing: ' ఒమిక్రాన్ పట్ల నిర్లక్ష్యం వద్దు.. గాంధీ ఆస్పత్రిలో జీనోం సీక్వెన్సింగ్'