No Permission to JP Nadda rally: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీకి హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో అనుమతి నిరాకరించినట్లు తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ భాజపా నేతలు నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈరోజు సాయంత్రం సికింద్రాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టనున్నారు.
No Permission to JP Nadda rally: హైదరాబాద్‌లో జేపీ నడ్డా ర్యాలీకి అనుమతి నిరాకరణ
No Permission to JP Nadda rally: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌లో తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా.. కొవ్వొత్తుల ర్యాలీ జరపాలని భాజపా నిర్ణయించింది.
జేపీ నడ్డా ర్యాలీకి అనుమతి నిరాకరణ
ఈ ర్యాలీలో పాల్గొనేందుకు జేపీ నడ్డా నగరానికి రానున్నారు. రాష్ట్రంలో కొవిడ్ నిబంధనలతో ఎలాంటి ర్యాలీలు, బహిరంగసభలకు అనుమతి లేదని.. అందుకే కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో నడ్డాను విమానాశ్రయం వద్దే అడ్డుకోనున్నట్లు సమాచారం. మరోవైపు భాజపా నేతలు మాత్రం ర్యాలీ నిర్వహించి తీరుతామని చెబుతున్నారు.
ఇదీ చూడండి:వైద్యులపై కరోనా పడగ.. 193 మందికి పాజిటివ్