తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంపై 'మాండౌస్​' ఎఫెక్ట్​.. మూడు రోజులు వర్ష సూచన..!

రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎల్లుండి ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. వర్షం వల్ల వాహనదారులు కాసేపు ఇబ్బందిపడ్డారు.

రాష్ట్రంపై 'మాండౌస్​' ఎఫెక్ట్​.. మూడు రోజులు వర్ష సూచన..!
రాష్ట్రంపై 'మాండౌస్​' ఎఫెక్ట్​.. మూడు రోజులు వర్ష సూచన..!

By

Published : Dec 10, 2022, 2:27 PM IST

మాండౌస్​ తుపాను ప్రభావంతో హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఎన్టీఆర్​ గార్డెన్​, ప్రసాద్​ ఐమ్యాక్స్​ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాహనదారులు కాసేపు ఇబ్బందిపడ్డారు. మరోవైపు వర్షం కారణంగా ఇండియన్​ రేసింగ్​ లీగ్​ చివరి సిరీస్​కు ఆటంకం ఏర్పడింది. ఉదయం నుంచి జరగాల్సిన రేసింగ్​.. వాన వల్ల మధ్యలో ఆపేశారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రేసింగ్​ ప్రారంభం కానుంది.

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఎల్లుండి ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మాండౌస్ తుపాను శుక్రవారం రాత్రి పదిన్నర నుంచి తెల్లవారుజాము ఒకటిన్నర మధ్యలో మహాబలిపురం వద్ద తీరం దాటిందని వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు. ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు తీవ్ర వాయుగుండంగా బలహీనపడి.. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ప్రస్తుతం చెన్నైకి వాయువ్య దిశగా 50 కి.మీ. దూరంలో కొనసాగుతుందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details