ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుఅత్యవసర పరిస్థితి ఎత్తివేత శ్రీలంకలో విధించిన అత్యవసర పరిస్థితి ఎత్తివేస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ప్రకటన వెలువరించారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి శ్రీలంకలో అత్యవసర పరిస్థితి విధించారు. అయితే.. ఈ నిర్ణయాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు.మైనార్టీలోకి రాజపక్స సర్కారు?సంక్షోభ శ్రీలంకలో గంటగంటకూ పరిణామాలు మారిపోతున్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా అన్ని వ్యవస్థలు కూలిపోతున్నాయి. మంగళవారం కూడా దేశమంతా ఆందోళనలు చేపట్టారు ప్రజలు. ఇక, ఆర్థిక మంత్రి అలీసర్బీ.. బాధ్యతలు తీసుకున్న 24 గంటల్లోనే రాజీనామా చేశారు. మరికొందరు చట్టసభ్యులు అధికార కూటమికి దూరంగా ఉన్నారు. కేజీ యాపిల్ రూ.1000, బియ్యం రూ.200 శ్రీలంక ఆర్థిక సంక్షోభం రోజురోజుకి తీవ్రమవుతోంది. దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధానమంత్రి మహీంద్రా రాజపక్స రాజీనామా చేయాలంటూ పార్లమెంట్ వెలుపల ప్రజలు భారీ నిరసనలు చేపట్టారు. నిత్యావసరాల ధరలు ఆకాశానంటుతున్నాయని వాపోతున్నారు.'పద్మనాభా నన్ను చంపు'తని కళ్లు ఆగకుండా వర్షిస్తున్నాయి. శరీరం చిగురుటాకులా కంపిస్తోంది. చేతిలోని కరవాలం జారిపోతోంది. ఎదురుగా తన సొంత అన్న.. గుడిలో ధ్వజస్తంభాన్ని ఆనుకుని నిటారుగా నిలుచున్నాడు. 'పద్మనాభా.. నన్ను చంపు' అని ఆదేశిస్తున్నాడు. తండ్రి సమానుడి మాటలు గుండెల్లో గునపాల్లా గుచ్చుతున్నాయి. కర్ణాటక సీఎం బొమ్మై సీరియస్ బెంగళూరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ గత మూడ్రోజులుగా ట్విటర్‌లో దుమారం రేపుతోంది. ఇప్పటికే ఈ ట్వీట్‌పై కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ స్పందించగా తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై గట్టిగా జవాబిచ్చారు.శ్రీలంకకు తెలుగు రాష్ట్రాల బియ్యంఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ప్రజలు నిత్యావసరాల కోసం అల్లాడుతున్నారు. వీరిని ఆదుకునేందుకు ముందుకొచ్చిన భారత్ అవసరమైన మేరకు సాయమందిస్తోంది. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలు శ్రీలంక ప్రజలకు బియ్యం పంపించనున్నాయి.అగ్రస్థానం అంబానీదే.. ఆసియా కుబేరుల జాబితాలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. రూ.6.8 లక్షల కోట్ల సంపదతో తొలి స్థానంలో కొనసాగుతున్నారు. మరో భారత కుబేరుడు గౌతమ్ అదానీ.. అంబానీకి అత్యంత చేరువలో ఉన్నారు.నా జీవితాన్నే మార్చేసింది'తన కెరీర్లో పేలవ దశ గురించి మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి ఒక యూట్యూబ్‌లో మాట్లాడాడు టీమ్ఇండియా వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్. సిడ్నీ టెస్టులో మ్యాచ్ గెలిపించనందుకు చాలా బాధపడ్డానని తెలిపాడు. ఇంకా ఏమన్నాడంటే..?ఈ బ్యూటీస్ వెరీ 'డేంజరస్'! స్వలింగసంపర్కుల నేపథ్యంగా దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కించిన సినిమా 'డేంజరస్'. ఈ నెల 8న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన అప్సరా రాణి, నైనా గంగూలీ ఫొటోషూట్స్పై ఓ లుక్కేద్దాం..ఆ సీన్స్‌ను సహజంగా చేయడానికే ప్రాధాన్యంకేజీఎఫ్ 2' క్లైమాక్స్ భారీ స్థాయిలో ఉంటుందని తెలిపారు సీనియర్ నటుడు సంజయ్ దత్. అందులో నటించడం చాలా కష్టంగా అనిపించిందని చెప్పారు. యాక్షన్ సన్నివేశాల్లో సహజంగానే నటించేందుకు ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు.