తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana News Today టాప్​ న్యూస్​ 5PM - Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Aug 14, 2022, 4:59 PM IST

  • చర్చిలో భారీ అగ్నిప్రమాదం, 41 మంది మృతి

Cairo church fire accident : చర్చిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గాయపడ్డారు. ఈజిప్ట్ రాజధాని కైరోలోని ఇంబాబా ప్రాంతంలో జరిగిందీ దుర్ఘటన.

  • RAIN ALERT రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు

RAIN ALERT ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ కారణంగా రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు. ఎల్లుండి కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

  • విజయాలను చూసి అందరూ గర్వపడాలన్న వెంకయ్య

Venkaiah Naidu on Azadi ka Amrit Mahotsav రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ స్వర్ణభారత్ ట్రస్ట్‌ హైదరాబాద్ చాప్టర్‌లో స్వాతంత్య్ర అమృత మహోత్సవాల నేపథ్యంలో ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా కార్యక్రమ ప్రచార వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శిక్షణార్థులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

  • కాంగ్రెస్​లో నడుస్తోన్న వ్యక్తిగత విమర్శలపై రేవంత్​రెడ్డి స్పందన

Revanth Reddy Comments కాంగ్రెస్​లో నాయకుల మధ్య నడుస్తోన్న వ్యక్తిగత విమర్శలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి స్పందించారు. ప్రజల సమస్యలపై, విధానాలపై మునుగోడులో చర్చ జరగాల్సి ఉందని వ్యక్తిగత దూషణలు అవసరం లేదని తెగేసి చెప్పారు.

  • RTC Special Offers స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్‌ ఆఫర్స్​

RTC Special Offers on Independence day ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిజామాబాద్‌లో పర్యటించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రేపు టీఎస్ఆర్టీసీ పలు రాయితీలు అందిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీని ప్రయాణికులు ఆదరిస్తున్నారని... మరింత ఆదరించాలని కోరారు.

  • పెళ్లికి వెళ్తూ ఆరుగురు మృతి

Beed road accident మహారాష్ట్ర.. బీడ్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు, టెంపో ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. మంజర్సుంబ- పటోడా హైవేపై ఆదివారం ఉదయం 5.30 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

  • చేతిలో జాతీయ జెండాతో 9కిమీ ఈత

Azadi Ka Amrit Mahotsav: ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​లో భాగంగా 75వ స్వాతంత్య్ర వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మహారాష్ట్ర కోల్హాపుర్​లోని శిరోల్​ తాలుకాలో కొందరు స్విమ్మర్లు ఈ సందర్భాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. కృష్ణామాయీ జల్​తరణ్​ మండల్​కు చెందిన 20 మంది సభ్యులు మిరాజ్​లోని కృష్ణా- వార్ణా నది సంగమం నుంచి శిరోల్​ ఉద్గావ్​ వరకు 9 కిలోమీటర్లు చేతిలో జెండా పట్టుకొని నదిలో ఈదుకుంటూ వెళ్లారు. గంటా 10 నిమిషాల్లోనే 9 కి.మీ. ఈదడం విశేషం. హరియాణా ఝజ్జర్​లో 6600 అడుగుల పొడవైన త్రివర్ణ పతాకంతో జనం ర్యాలీ నిర్వహించారు.

  • సెంచరీ జస్ట్​ మిస్​, 44 బంతుల్లో 9 సిక్సర్లతో బ్యాటర్​ వీరవిహారం

Dawid Malan: ఇంగ్లాండ్‌ వేదికగా జరుగుతున్న హండ్రెడ్‌ టోర్నమెంట్‌లో బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. 100 బంతుల్లో ముగిసే మ్యాచ్‌ అయినందున అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాటర్లు.. సిక్సర్లు, బౌండరీలతో మైదానాలను హోరెత్తిస్తున్నారు. తాజాగా మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్‌ రాకెట్స్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మలాన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

  • కార్లు పైకిలేస్తే థియేటర్లకు జనాలు రారంటున్న బండ్ల గణేష్

మంచి కథనంతో సినిమాలు తెరకెక్కిస్తే తెలుగు ప్రేక్షకులు వాటిని ఆదరిస్తారని ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్​ అన్నారు. ఓటీటీలకు అలవాటు పడి ప్రజలు థియేటర్లకు రావడం లేదంటున్న వారికి ఆయన స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చారు. సోషల్​ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసి పలు సూచనలు కూడా చేశారు.

  • సీతారామం సినిమా స్టోరీకి ఆ ఉత్తరమే ఆధారమట

మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌, హీరోయిన్​ మృణాల్​ ఠాకూర్​ జంటగా తెలుగులో నటించిన ప్రేమకథా చిత్రం 'సీతా రామం'. ఈ ప్రేమ కథా చిత్రంలో హీరోహీరోయిన్ల నటనకు సినీప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతే కాకుండా హిట్​ టాక్​తో ఈ మూవీ తెలుగురాష్ట్రాల్లో అన్నిచోట్ల మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా యువ కథానాయకుడు తేజ సజ్జ.. సీతారామం హీరోహీరోయిన్లతో పాటు చిత్ర దర్శకుడు హను రాఘవపూడితో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. అందులో భాగంగా అసలు సీతారామం కథ ఎలా పుట్టింది? స్క్రిప్ట్​ ఎప్పుడు మొదలుపెట్టారు? లవ్ స్టోరీ సినిమాలు మాత్రమే తీయడానికి కారణాలు? వంటి ఆసక్తికర విశేషాలను హను రాఘవపూడి పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..

ABOUT THE AUTHOR

...view details