ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుటీమ్ఇండియాకు బిగ్ షాక్.. Bumrah Asia Cup: ప్రతిష్టాత్మక ఆసియా కప్‌కు ముందు టీమ్ఇండియాకు పెద్ద షాక్ తగిలింది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. ఈ టోర్నీకి దూరమయ్యాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఆసియా కప్ కోసం భారత జట్టును సోమవారమే ఎంపిక చేయనుంది సెలక్షన్ కమిటీ. అయితే.. జట్టును ఇవాళే ప్రకటిస్తారా లేదా అనేది స్పష్టత లేదు. గాయం తీవ్రతరం కాకుండా.. బుమ్రా టీ-20 వరల్డ్‌కప్ వరకు సిద్ధంగా ఉండేందుకే విశ్రాంతిని ఇస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు.క్యాసినో వ్యవహారం.. కీలక ఆధారాలుChikoti Praveen: క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. నాలుగు రోజుల పాటు చికోటి ప్రవీణ్‌ను విచారించిన ఈడీ అధికారులు అతని వద్ద నుంచి కీలక ఆధారాలు సేకరించారు. చికోటి ప్రవీణ్ ఇచ్చిన వివరాలను విశ్లేషిస్తున్నారు. విచారణలో గత పదేళ్లుగా విదేశీ ప్రయాణ వివరాలు ఈడీ అధికారులు సేకరించారు.యూజీసీ-నెట్ రెండో దశ పరీక్షలు వాయిదా.. UGC-NET phase 2 postponed: యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండో దశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 12 నుంచి 14 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ సెప్టెంబర్ నెలఖారులో నిర్వహిస్తామని యూజీసీ ఛైర్మన్ వెల్లడించారు.కాలునొప్పి ఉన్నా.. కల నేరవేర్చుకుందిPV Sindhu Parents:12 ఏళ్లుగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తుందంటే ఆట పట్ల సింధుకు ఉన్న నిబద్ధత ఏలాంటిదో అర్థం చేసుకోవచ్చని ఆమె తండ్రి రమణ అన్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో సింధు పసిడి పతకాన్ని గెలవడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కామన్వెల్త్లో స్వర్ణం సాధించాలన్న తన కల నెరవేరిందని ఆయన తెలిపారు. ఒత్తిడిని తట్టుకుని చాలా అద్భుతంగా ఆడిందని ఆయన తెలిపారు. ఒక తండ్రిగా చాలా గర్వపడుతున్నానని.. సింధు బంగారు పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందని సింధు తల్లి విజయ అన్నారు. రెండు రోజులుగా కాలు నొప్పి ఉందని చెప్పిందని.. కానీ చాలా బాగా ఆడిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలకు సీఎం అభినందనలు CM KCR Wishes: కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన పీవీసింధు, బాక్సర్ నిఖత్ జరీన్‌కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. మరోసారి ప్రపంచ వేదికపై మన క్రీడాకారులు సత్తా చాటారని ప్రశంసించారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు.అదరగొట్టిన పీవీ సింధు.. తొలిసారి స్వర్ణం కైవసంకామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది. తాజాగా బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్స్‌లో సింధు.. కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని ఓడించింది. హాకీలో భారత్ పసిడి ఆశలు ఆవిరి Indian Hockey Team: కామన్వెల్త్ గేమ్స్ హాకీలో అదరగొడుతుందనుకున్న టీమ్ ఇండియా ఫైనల్లో చతికిలపడింది. ఆస్ట్రేలియా చేతిలో 7-0 తేడాతో చిత్తుగా ఓడి రజతంతో సరిపెట్టుకుంది. దీంతో.. 2022 కామన్వెల్త్ క్రీడల్లో మొత్తం భారత్ 61 పతకాలు సాధించింది. మొత్తం 22 స్వర్ణాలు ఉండగా.. 16 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.పార్లమెంటు నిరవధిక వాయిదా.. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నాలుగు రోజులు ముందే ముగిశాయి. లోక్‌సభ, రాజ్యసభ సోమవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ముందుకు అనుకున్న ప్రకారం.. ఈనెల 12 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే.. అంతకన్నా ముందే ఉభయసభలు వాయిదా పడ్డాయి.ఈనెల 28న కానిస్టేబుల్ రాత పరీక్ష రాష్ట్రంలో కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీని మారుస్తున్నట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఈ నెల 21న జరగాల్సిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను 28న నిర్వహించాలని నిర్ణయించింది. సాంకేతిక కారణాల వల్ల తేదీని మార్చినట్లు నియామక బోర్డు వెల్లడించింది. ఆదివారం ఎస్సై రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.తలైవా మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా? సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారని తమిళనాట వార్తలు గుప్పుమంటున్నాయి. సోమవారం ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవితో తలైవా 45 నిమిషాలకు పైగా సమావేశమవ్వడమే అందుకు కారణం. అయితే భేటీ అనంతరం రజినీ తన పొలిటికల్ రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు.