1. నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ
తెలంగాణలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి 30 తేదీ ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, ఫార్మసీలు, ల్యాబ్‌లకు మినహాయింపు ఇచ్చారు. రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్ల మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. భక్తులు లేకుండానే..
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వల్ల కల్యాణ వేడుక సామూహికంగా జరుపుకోలేకపోతున్నామని అన్నారు. భద్రాద్రిలో పూజారులు, అధికారుల సమక్షంలో రాములోరి కల్యాణం జరుగుతుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. థియేటర్లు బంద్
తెలంగాణలో రేపటి నుంచి సినిమా థియేటర్లు పాక్షికంగా మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రదర్శనలపై సినీ నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శనకారులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా హాల్స్‌ను పాక్షికంగా బంద్ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ప్రచారం కుదింపు
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మినీపురపోరు సమయాన్ని కుదించారు. కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రచార సమయాల్లో మార్పులు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. విషయం తేలాల్సిందే..
రంగారెడ్డి భాజపా జిల్లా కమిటీ నేతలు కేటీఆర్‌ను కలవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. లింగోజీగూడ డివిజన్ ఉపఎన్నికను ఏకగ్రీవం చేయడానికి కేటీఆర్‌ను ఎందుకు కలవాల్సి వచ్చిందనే అంశాలను తెలుసుకోవడానికి నిజనిర్ధారణ కమిటీని వేశామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.