తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్@11AM - తెలంగాణ వార్తలు

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్ న్యూస్@11AM
టాప్​టెన్ న్యూస్@11AM

By

Published : Jan 10, 2021, 11:00 AM IST

1. కొత్తగా 351

రాష్ట్రంలో కొత్తగా 351 కరోనా కేసులు బయటపడ్డాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 65 మందికి కొవిడ్​ సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 2,89,784కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. అత్యున్నత పురస్కారం

ఉషా లక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘురాంకి బ్రిటీష్ ప్రభుత్వ రెండో అత్యున్నత పురస్కారం లభించింది. ఆఫీసర్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్​లెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్- ఓబీజీ అవార్డు ఆయనను వరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. కుటుంబ పాలన

భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్... యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. తరుణ్ చుగ్​కు ఆలయాధికారులు సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. రికార్డ్స్

కామారెడ్డి​ జిల్లాలో మరో ఆణిముత్యం మెరిసింది. తన మేధాశక్తితో ఇండియా టాపర్​గా నిలిచింది. వండర్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు సంపాదించింది. త్వరలో జరగబోయే ప్రపంచ ఛాంపియన్​షిప్​లో పోటీ చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. కొత్తగా 18,645 కేసులు

దేశవ్యాప్తంగా కొత్తగా 18,645 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 201మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 4లక్షల 50వేలు దాటినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. 'ఇంజినీర్'​ రైతు

పొలానికి సాగునీరు అందించడానికి స్వయంగా తానే ఇంజినీర్​ అవతారమెత్తాడు ఒడిశాకు చెందిన ఓ రైతు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాన్ని పండించడానికి వాటర్​వీల్ పరికరం తయారు చేసి.. దాని ద్వారా నీటిని అందిస్తున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. 11మంది మృతి

ఇండోనేసియాలో కొండచరియలు విరిగిపడి 11 మంది మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. రిస్క్ చేయాలి గురూ!

పెట్టుబడి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యం. ఎందుకంటే భవిష్యత్ అవసరాలను తీర్చేవి ఇవే. అయితే కొంత మంది రిస్క్​ భయాలతో పెట్టుబడి పెట్టేందుకు దూరంగా ఉంటారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. సంగీత సింధువు

సవర సన్నిధిలో అన్ని మతాలూ ఒక్కటే అని వెలుగెత్తారాయన. తన సంగీతానికి వయసు వార్థక్యంతో సంబంధం లేదని నిరూపించారు. అవే గనుక ఉంటే తాను ఎడారిలో కోయిలనేనని అంటారు దిగ్గజ గాయకుడు కేజే యేసుదాస్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. భారీ లక్ష్యం

సిడ్నీ టెస్ట్​లో భారత్​పై పూర్తి ఆధిపత్యం చూపింది ఆస్ట్రేలియా. 312 పరుగుల వద్ద డిక్లేర్ చేసి భారత్​ 407 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details