తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @11AM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News
Telangana Top News

By

Published : Jan 2, 2023, 10:58 AM IST

  • పోలీసుల అదుపులో మరో డ్రగ్ స్మగ్లర్..

డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు మరో స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

  • ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ ఆందోళన.. రేవంత్ రెడ్డి గృహ నిర్బంధం

ప్రజా సమస్యలపై పోరాడేందుకే ఏర్పాటు చేసిన ధర్నా చౌక్‌ వద్ద తమ ధర్నాను అడ్డుకోవడంలో అర్థం లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సర్పంచుల నిధుల సమస్యలపై ధర్నా చౌక్ వద్ద ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

  • హైదరాబాద్​లో రూ.కోట్లు కురిపిస్తున్న పాత ఆటోలు..

భాగ్యనగరంలో కొందరు రవాణా శాఖ అధికారులు, ఫైనాన్షియర్లు నయా దందాకు తెరలేపారు. వాహన కాలుష్యం దృష్ట్యా కొత్త ఆటోల రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన నేపథ్యంలో పాత ఆటోలను కొని వాటిని తుక్కుకింద మార్చి వాటి స్థానంలో కొత్తవాటికి అనుమతిస్తున్నారు. రవాణా శాఖ కార్యాలయాల్లో పాత ఆటోల స్థానంలో కొత్తవాటికి రూ.లక్షలు తీసుకుంటున్నారు.

  • దిల్లీని తలపించేలా దుమ్ము.. దుమారం.. ఎక్కడంటే..?

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని మాస్కు ముసుగున నెట్టేసింది. కానీ కొవిడ్ రావడానికంటే ముందే ఆ ప్రాంత ప్రజలు మాస్కులు ధరించకుండా బయట అడుగుపెట్టలేని పరిస్థితి. ఈ పరిస్థితికీ ఓ మహమ్మారి కారణం. కానీ అది కరోనా వంటి వైరస్ కాదు. ఆ ప్రాంతంలో ఉండే ఓ పరిశ్రమ వెదజల్లే ఘన, ద్రవ, వాయు వ్యర్థాలు. ఆ పరిశ్రమ వల్ల వచ్చే దుమ్ము, ధూళితో అక్కడి ప్రజలు ఏళ్ల తరబడి మాస్కులు ధరించే జీవిస్తున్నారు.

  • బాల్యాన్ని కబళిస్తోన్న క్షయ.. హైదరాబాద్‌లోనే అత్యధికంగా..!

రాష్ట్రంలో క్షయ(టీబీ) మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. వేల మంది ప్రాణాలను కబళిస్తోంది. కరోనా వంటి కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నా.. టీబీ మాత్రం ఏళ్లుగా పట్టిపీడిస్తూనే ఉంది. దీని కోరల్లో ఏటా కొత్తగా వేల మంది చిక్కుకుంటూనే ఉన్నారు. 2022లో మొత్తం బాధితుల సంఖ్య 64 వేలకు చేరింది. వీరిలో సుమారు 8 శాతం మంది 15 ఏళ్లలోపు వయసు పిల్లలుండటం గమనార్హం.

  • ఐడియా అదిరింది గురూ: బస్‌లో షాపింగ్ మాల్..

కుక్కపిల్ల, సబ్బు బిల్ల, అగ్గిపుల్ల.. కాదేది కవితకు అనర్హం అన్నాడో మహాకవి. సద్వినియోగం చేసుకునే ఆలోచనంటూ ఉండాలే కానీ వ్యర్థ పదార్థం అంటూ ఏదీ ఉండదని నిరూపించాడు ఓ చిరు వ్యాపారి. అందుకే కాలం చెల్లిన బస్సును తన వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నాడు.

  • పట్టాలు తప్పిన ప్రయాణికుల రైలు పలువురికి గాయాలు..

రాజస్థాన్ పాలి జిల్లాలో ఓ రైలు పట్టాలు తప్పింది. బాంద్రా నుంచి జోద్​పుర్​కు వెళ్తున్న సూర్యనగరి ఎక్స్​ప్రెస్ పాలి రైల్వే స్టేషన్​కు వచ్చే ముందు అదుపుతప్పింది. దీంతో సుమారు 12 బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వాయువ్య రైల్వే సీపీఆర్ఓ తెలిపారు.

  • 86 ఏళ్ల వయస్సులో ఆరు నిమిషాలు శీర్షాసనం వేసి గిన్నిస్ రికార్డ్...

కొందరు యువకులకు సాధారణ ఆసనాలు వేస్తేనే ఆయాసంగా అనిపిస్తుంది. అలాంటిది కూర్చోవడమే కష్టమైన వృద్ధాప్యంలో శీర్షాసనం వేయడం అసాధారణ విషయం. అయితే, అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారు

  • పెరిగిన బంగారం, వెండి ధరలు..

దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

  • కార్ల అమ్మకాల్లో రికార్డ్‌.. మారుతీ టాప్ గేర్.. హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌ జోరు..

2022లో 23 శాతం వృద్ధితో వాహన పరిశ్రమ రికార్డులు బద్దలుకొట్టింది. దేశీయంగా ప్రయాణికుల వాహన విక్రయాలు రికార్డు స్థాయిలో 37.93 లక్షలుగా నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details