టాలీవుడ్లో మరో విషాదం.. ప్రముఖ నటుడు చలపతిరావు (78) హఠాన్మరణం చెందారు. ఆదివారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 600కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. చాలా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి.. ప్రేక్షకుల మదిపై చలపతిరావు చెరగని ముద్ర వేశారు. మట్టి గాజుల్లో మాదక ద్రవ్యాలు.. దగదగ మెరిసే గాజుల మాటున మత్తు దందా సాగిస్తున్న ఓ ముఠా ఎత్తులను హైదరాబాద్ పోలీసులు చిత్తుచేశారు. వివిధ ప్రాంతాల నుంచి డ్రగ్స్‌ను తీసుకువచ్చి హైదరాబాద్ అడ్డాగా విదేశాలకు పంపుతున్న కేటుగాళ్ల ఆట కట్టించారు. రూ.3 కోట్లకు పైగా విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని.. వెనకుండి నడిపిస్తున్న వారి కోసం ఆరా తీస్తున్నారు. అవయవాలు కావాల్సిన వారు లక్షల్లో.. దాతలు వేలల్లోకేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో ఏటా 1.8 లక్షల మూత్రపిండాల వైఫల్య కేసులు నమోదవుతుండగా.. కిడ్నీ మార్పిడులు కేవలం 6 వేలే జరుగుతున్నాయి. ఏటా 25-30 వేల వరకు కాలేయ మార్పిడులు అవసరం ఉండగా.. జరుగుతున్నవి కేవలం 1,500 మాత్రమే. తెలుగును రక్షించుకుందాం.. తెలివితేటలు పెంచుకుందాం తెలుగును రక్షించుకుందాం.. తెలివితేటలు పెంచుకుందాం అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి. శేషసాయి పేర్కొన్నారు. మాతృభాష పరిరక్షణలో తల్లులు, గురువులదే కీలక భూమిక అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో రెండు రోజుల పాటు జరిగిన తెలుగు రచయితల ఐదో మహాసభల్లో.. తెలుగు భాష పరిరక్షణ కోసం 18 తీర్మానాలు చేశారు. ఫోన్ మాయం.. చెప్పుకోలేని భయం..ప్రస్తుత రోజుల్లో చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా ప్రతి వ్యక్తి జీవితం సెల్‌ఫోన్ చుట్టూ తిరుగుతోంది. చాలా మంది తమ వ్యక్తిగతకు సంబంధించిన అంశాలను అందులో భద్రపరచుకుంటుంటారు. అలాంటి ఫోన్ చోరీకి గురైనప్పుడు కొందరు మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. పొరపాటున బ్యాంక్ ఖాతాల్లోకి రూ.2కోట్లు..పొరపాటున తమ అకౌంట్లో పడిన రూ.2.44 కోట్లను ఖర్చు చేశారు ఇద్దరు యువకులు. ఈ ఘటన కేరళలో జరిగింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆ దేశాల నుంచే అధిక ముప్పు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అమెరికా, రష్యా, చైనాల నుంచి ముప్పు పొంచి ఉందని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ జోసెఫ్ స్టిగ్లిట్జ్ అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్ల పెంపుతో ద్రవ్యోల్బణం తగ్గదని దాని కారణంగా నిరుద్యోగిత మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. దక్షిణాఫ్రికాలో పేలిన గ్యాస్ ట్యాంకర్.. దక్షిణ ఆఫ్రికాలోని బోక్స్‌బర్గ్ పట్టణంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ ట్యాంకర్ పేలి తొమ్మిది మంది మరణించారు. అన్న బాట.. తమ్ముడి ఆట.. ఐపీఎల్ ఛాన్స్ కొట్టిన కశ్మీరీ ఆటగాడు..జమ్ముకశ్మీర్ నుంచి వెలుగులోకి వచ్చే క్రికెటర్లే తక్కువ. అందులోనూ విపరీతమైన పోటీ ఉండే ఐపీఎల్‌లో చోటు దక్కాలంటే చాలా కష్టం. దేశవాళీ అనుభవం చాలా తక్కువే అయినే ఆ రాష్ట్రానికి చెందిన యువ లెగ్‌స్పిన్ ఆల్‌రౌండర్ వివ్రాంత్‌శర్మను ఫ్రాంఛైజీలు పోటీపడిమరీ సన్‌రైజర్స్ దక్కించుకుంది. ఓటీటీలోకి అవతార్ 2 అప్పుడే.. సరికొత్త ప్రపంచంతో ప్రేక్షకులను అలరించింది అవతార్ 2. తాజాగా ఈ సినిమా ఓటీటీపై చర్చ జరుగుతోంది. కాగా, ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలో అవతార్ 2 విడుదల కాబోతుందని సమాచారం. విడుదల తేదీ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.