తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @3PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News today
Telangana Top News today

By

Published : Dec 8, 2022, 2:59 PM IST

  • మేజిక్ ఫిగర్ దాటిన భాజపా..

గుజరాత్​లో వరుసగా ఏడోసారి బీజేపీ ఘన విజయం సాధించింది. మేజిక్ ఫిగర్ 92ను దాటి 150కుపైగా స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. గుజరాత్​లో బీజేపీ తిరుగులేని ఆధిక్యంతో దూసుకెళ్తోంది.

  • హిమాచల్​లో కాంగ్రెస్​ జాక్​పాట్..

మూడు దశాబ్దాల సంప్రదాయాన్ని హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు కొనసాగించారు. ప్రభుత్వాన్ని ఐదేళ్లకోసారి గద్దె దించే పద్ధతిని ఈసారీ పాటించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా ఓటమి చవిచూడగా.. మెజారిటీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.

  • కరీంనగర్​లో సీఎం పర్యటన.. కాంగ్రెస్​ శ్రేణులు అరెస్ట్​

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కరీంనగర్​లో పర్యటించనున్నారు. నగర మాజీ మేయర్ రవీందర్ సింగ్ కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. అనంతరం మంత్రి గంగుల ఇంటికి వెళ్లనున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో నగర కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

  • మోదీ కంచుకోట మరింత దృఢం.. భాజపా విజయానికి 10 కారణాలివే...

గుజరాత్​లో కమలం మరోసారి సత్తా చాటింది. వరుసగా ఏడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అన్నీ తానై ఈ ఎన్నికల్లో భాజపా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లి సఫలీకృతమయ్యారు. వీటితో పాటు పలు అంశాలు భాజపా గెలుపునకు దోహదపడ్డాయి. అవేంటంటే?

  • ఐదేళ్ల క్రితం 77.. ఇప్పుడు 20 కూడా కష్టం.. కాంగ్రెస్​ దుస్థితికి 10 కారణాలివే..

భారత్​ జోడో యాత్రతో పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజం నింపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్​కు.. గుజరాత్​ ఎన్నికల రూపంలో గట్టి షాక్ తగిలింది. భాజపా కంచుకోటను బద్దలు కొట్టలేకపోగా.. కనీసం బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని దుస్థితికి చేరింది.

  • డింపుల్​ యాదవ్​ నయా రికార్డ్​..

యూపీ ఉప ఎన్నికలో మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్​ యాదవ్​ భార్య.. మామను మించిన మెజారిటీతో దూసుకెళ్తుంది. దీంతో మైన్‌పురిలో నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్‌ యాదవ్‌ విజయం దాదాపు ఖారారైందని పార్టీశ్రేణులు ధీమావ్యక్తం చేశారు.

  • 'రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ జెండా ఎగురవేస్తుంది'

గుజరాత్​లో బీజేపీ ఘన విజయం సాధించింది. వరుసగా ఏడోసారి కమలం వికసించింది. ఈ ఫలితాలపై రాష్ట్ర బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణ స్పందించారు. వరుసగా ఏడోసారి బీజేపీకి పట్టం కట్టిన గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

  • బోన్సాయ్​ మొక్కల పెంపకం.. హైదరాబాద్​లో ఇప్పుడిదే ట్రెండింగ్

బోన్సాయ్ మెుక్కల పెంపకంపై మహిళలు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. విద్యావంతులైన గృహిణిలతో పాటు ఇంటి యజమానులు ఈ మరుగుజ్జు మెుక్కల పెంపకాన్ని ఓ వ్యాపకంగా మలుచుకుంటున్నారు. ఈ డిమాండ్​ను గమనించిన అగ్రి, హార్టికల్చర్ సొసైటీలు.. బాన్సోయ్​ మొక్కల పెంపకంపై నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

  • టీమ్​ఇండియా షెడ్యూల్‌: లంక, కివీస్​, ఆసీస్​తో సిరీస్‌ వివరాలు ఇవే

టీమ్‌ఇండియా కొత్త ఏడాది వరుస సిరీస్‌లతో బిజీ బిజీగా గడపనుంది. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో స్వదేశంలో సిరీస్‌లను ఆడనుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేసింది బీసీసీఐ. అయితే వీటిలో రెండు వన్డేలకు తెలుగు రాష్ట్రాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. న్యూజిలాండ్‌తో (జనవరి 18) హైదరాబాద్‌ వేదికగా, ఆస్ట్రేలియాతో (మార్చి 19) వైజాగ్‌ వేదికగా మ్యాచ్‌లు జరుగనున్నాయి.

  • ఆ స్టార్​ హీరో సినిమాతో సింగర్ సునీత సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ

తన మధురమైన స్వరంతో ఎంతో కాలంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు సింగర్​ సునీత. పాటలతోనే కాకుండా పలువురు హీరోయిన్లకు డబ్బింగ్‌ చెప్పి అభిమానులకు మరింత చేరువయ్యారు. సినిమాలతో పాటు కొన్ని ప్రైవేట్‌ ఆల్బమ్స్​లోని వందలాది పాటలకు తన స్వరాన్ని అందించారు.

ABOUT THE AUTHOR

...view details