తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @1PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News today
Telangana Top News today

By

Published : Nov 28, 2022, 1:00 PM IST

  • బండి సంజయ్​ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్​సిగ్నల్​.. కానీ..?

బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. భైంసా పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహిస్తేనే అనుమతించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. భైంసాలోకి వెళ్లకుండా పాదయాత్ర కొనసాగించాలని సూచించింది.

  • నల్లొండ పర్యాటనలో సీఎం కేసీఆర్​

ముఖ్యమంత్రి కేసీఆర్​ నల్గొండ పర్యటన ప్రారంభమైంది. తొలత బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్​లో బయల్దేరిన ఆయన.. దామరచర్లకు చేరుకున్నారు. అక్కడ థర్మల్​ పవర్​ ప్లాంట్​ పురోగతిని కేసీఆర్​ పరిశీలించనున్నారు.

  • పోలీసుల కస్టడీలో నందకుమార్​..

'ఎమ్మెల్యేలకు ఎర' కేసు నిందితుడు నందకుమార్​ను బంజారాహిల్స్​ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఫిలింనగర్‌లోని దక్కన్ కిచెన్ స్థలాన్ని సబ్ ​లీజుకు ఇచ్చి డబ్బులు వసూలు చేశారన్న కేసు దర్యాప్తులో భాగంగా చంచల్​గూడ జైలు నుంచి స్టేషన్​కు తరలించారు. దక్కన్ కిచెన్ స్థలం లీజ్, సబ్‌ లీజుకు సంబంధించిన కేసులో పోలీసులు నందకుమార్​ను ప్రశ్నిస్తున్నారు.

  • దీపం వత్తులు, బొట్టు బిళ్లల తయారీ పేరుతో.. భాగ్యనగరంలో భారీ మోసం

భాగ్యనగరంలో మరో భారీ మోసం బయటపడింది. హైదరాబాద్​లో దీపం వత్తులు, బొట్టు బిళ్లలు తయారీ యంత్రాలు పేరుతో కొల్లు రమేష్​ అనే వ్యక్తి కోట్ల రూపాయాలు టోకరా చేశారు. సుమారు 1,100 మంది బాధితులు ఉన్నట్లు అంచనా వేశారు.

  • ఇండిగో విమానంలో 'టిష్యూ పేపర్ బాంబ్'..

బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఓ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలోని ఓ సీటు కింద టిష్యూ పేపర్ దొరికిందని, అందులోనే బాంబు సందేశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, వెంటనే పరిశీలన చేపట్టగా.. విమానంలో బాంబు లేదని తేలింది.

  • యువతిపై తండ్రీకొడుకులు రేప్​..

ఓ యువతిపై ఆమె ప్రియుడు, అతడి తండ్రి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, ఓ మైనర్​.. పాఠశాల టాయిలెట్​లో శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఆ చిన్నారిని నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి వెళ్లిపోయింది. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్​లో వెలుగుచూసింది.

  • విద్యుత్ టవర్​ను ఢీకొట్టిన విమానం..

అమెరికాలో ఓ విమానం అదుపుతప్పి విద్యుత్ టవర్​ను ఢీకొట్టింది. విమానంలోని ఇద్దరు వ్యక్తులు అందులోనే చిక్కుకుపోయారు. వారిని కిందకు దించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

  • 'ఆ విషయంలో BCCI, PCB కలిసి నిర్ణయం తీసుకోవాలి'

పాక్‌లో భారత్‌ ఆడకపోతే.. తాము కూడా ఆ దేశంలో ఆడేది లేదని పీసీబీ చీఫ్‌ రమీజ్‌ రజా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల క్రికెట్‌ బోర్డుల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. రజా హెచ్చరికలపై నిన్న కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కౌంటర్‌ ఇవ్వగా.. తాజాగా మాజీ ఓపెనర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ స్పందించారు.

  • 'కొన్నిసార్లు తిరుగుబాటు అవ‌స‌రమే'.. 'RC 16' అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ వచ్చేసిందోచ్​..

మెగా పవర్​ స్టార్​ రామ్‌చ‌ర‌ణ్ 16వ సినిమాను సోమ‌వారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ సినిమాకు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఉప్పెన సినిమాతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన బుచ్చిబాబు రెండో సినిమాతోనే బంప‌ర్​ఆఫ‌ర్‌ను అందుకున్నారు. కొన్నిసార్లు తిరుగుబాటు అవ‌స‌రమంటూ ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌పై ఉన్న క్యాప్ష‌న్‌ ఆస‌క్తి పెంచుతోంది.

  • ఈ వారమే 'హిట్​ 2', 'మట్టి కుస్తీ'.. ఇంకా ఏ చిత్రాలు రానున్నాయంటే?

2022 ముగింపు వచ్చేసింది. ఇంకో నాలుగు వారాలు.. ఈ ఏడాది ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. మరి చివరి నెల మొదటి వారంలో థియేటర్‌/ ఓటీటీలో అలరించే చిత్రాలు.. వెబ్‌సిరిస్‌లు ఏమున్నాయో చూసేయండి.

ABOUT THE AUTHOR

...view details