- డిసెంబర్‌లో శాసనసభ సమావేశాలు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేంద్రం విధిస్తున్న ఆంక్షలపై చర్చించేందుకు శాసనసభను సమావేశపరచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. డిసెంబర్‌లో వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి... అందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డిని ఆదేశించారు.
- హైకోర్టు జడ్జిల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు
హైకోర్టు జడ్జిల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మద్రాస్ హైకోర్టులో పనిచేస్తోన్న జడ్జిలను వివిధ హైకోర్టులకు బదిలీ చేయడానికి కొలీజియం సిఫారసు చేసింది.
- మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ సోదాల్లో రూ.15 కోట్లు స్వాధీనం
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన... మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై.. ఆదాయపన్ను శాఖ అధికారుల సోదాలు.. ముగిశాయి. పలు పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్న ఐటీ బృందాలు... మంత్రి సహా ఆయన బంధువులకు సమన్లు జారీ చేశారు. ఈ నెల28, 29 తేదీల్లో హాజరై వివరణ ఇవ్వాలని ఐటీ వర్గాలు ఆదేశించాయి.
- ఎమ్మెల్యేలకు ఎర కేసు.. విచారణ వేగవంతం చేసిన సిట్..
తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ జోరు పెంచింది. ఇప్పటికే కేరళ, హరియాణాలో సోదాలు చేసిన అధికారులు... కేసుతో సంబంధం ఉన్న మరికొందరికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 29న విచారణకు రావాలని వైకాపా ఎంపీకి సిట్ తాఖీదులు ఇచ్చింది. నోటీసులను సవాలు చేస్తూ పిటిషన్ వేసిన న్యాయవాది ప్రతాప్‌నకు... హైకోర్టులో ఊరట లభించింది.
- దిల్లీ లిక్కర్ స్కామ్.. అభిషేక్ బోయిన్‌పల్లికి జ్యుడీషియల్ రిమాండ్
దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ, సీబీఐ సంయుక్త దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో అభిషేక్, విజయ్‌నాయర్, శరత్‌చంద్రారెడ్డి, బినోయ్ బాబులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌లు తీహాడ్ జైలులో ఉన్నారు. ఇవాళ వీరి బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది.
- ఎమ్మెల్యేలకు ఎర కేసులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణకు సిట్ నోటీసులు