- గవర్నర్ X సీఎం.. వయా వీసీ.. కేరళ రాజకీయంలో కొత్త ట్విస్ట్
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.. తొమ్మిది యూనివర్సిటీల వీసీలను రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేయడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. వీసీలను రాజీనామా చేయమనే అధికారాలు గవర్నర్కు లేవని అన్నారు.
- యుద్ధం మనకు ఆఖరి ప్రత్యామ్నాయం.. కానీ..: మోదీ
యుద్ధాన్ని భారత్ ఎల్లప్పుడూ చివరి ప్రత్యామ్నాయంగానే చూసిందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే.. దేశంపై కన్నేసే దుష్టశక్తులకు దీటైన జవాబు ఇచ్చేందుకు భద్రతా దళాలు సర్వత్రా సిద్ధంగా ఉంటాయని స్పష్టం చేశారు. కార్గిల్లో జవాన్లతో కలిసి దీపావళి జరుపుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ.
- 'ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న తెరాసకి యువత అండగా నిలబడాలి'
ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా మునుగోడు ఉపఎన్నిక దృష్ట్యా.. యువతకు ఉపాధి అనే అంశంపై ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న తెరాస ప్రభుత్వానికి యువత అండగా నిలబడాలని కేటీఆర్ ట్విటర్‌లో కోరారు.
- సదర్ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధం.. ప్రత్యేక ఆకర్షణగా గరుడ, లవ్రాణా
సదర్ వచ్చిదంటే చాలు.. భాగ్యనగరంలో ఆ సందడేవేరు..! కోట్లాది రూపాయల విలువ చేసే దున్నపోతులు విన్యాసాలతో ఆకట్టుకుంటాయి. దీపావళి మరుసటి రోజు నిర్వహించే సదర్ వేడుక ఈసారీ కూడా మరిన్ని విశేషాలతో సిద్ధమైంది. హరియణ, పంజాబ్, ఆస్ట్రేలియా నుంచి దున్నరాజులు సైతం వచ్చేశాయి.
- ‘దీపావళి కాలుష్యం’ నుంచి ఊపిరితిత్తులు జాగ్రత్త.. ఇవిగో చిట్కాలు
దీపావళి కాలుష్యంతో ఆస్తమా రోగులకే కాదు.. మామూలు వారిలోనూ కొన్ని శ్వాససంబంధమైన సమస్యలు తప్పవంటున్నారు వైద్యులు. దగ్గు, శ్వాస పీల్చుకోలేకపోవడం, గురక, ఆస్తమా వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
- ఆర్గానిక్ స్వీట్స్.. ఆరోగ్య ప్రయోజనాలు అనేకం