రాష్ట్రానికి తౌక్టే ఎఫెక్ట్
ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఇబ్బంది పడుతోన్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. ఉదయం నుంచి వేడిగా ఉన్న వాతావరణం సాయంత్రానికి జోరువానతో పలకరించింది. అయితే పలు జిల్లాల్లో తౌక్టే తుపాను ప్రభావంతో.. ఈదురు గాలులతో కురిసిన వర్షానికి భారీ నష్టం సంభవించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'నా భర్తకు ప్రాణహాని ఉంది'
తన భర్తకు ప్రాణహాని ఉందని ఏపీ ఎంపీ రఘురామ భార్య రమ భయాందోళన వ్యక్తం చేశారు. ఈ రాత్రికి జైల్లో దాడి చేస్తారనే సమాచారం ఉందని చెప్పారు. వైకాపా ప్రభుత్వంపై నమ్మకం లేదని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కరోనా లేని గ్రామం
ఎక్కడ విన్నా.. ఎక్కడ చూసినా .. కరోనా మిగిల్చిన కన్నీటి గాధలే. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా కొవిడ్ విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నా.. దాని ఉద్ధృతి మాత్రం తగ్గలేదు. కాని ఓ గ్రామంలో మాత్రం కరోనా పప్పులుడకలేదు. అది ఏ గ్రామమో చూద్దాం పదండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు
రెండు రోజుల క్రితం జరిగిన గర్భిణీ పావని, శిశు మరణాలపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన వైద్యాధికారులు ఇవాళ మల్లాపూర్‌లోని కుటుంబసభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ర్యాపిడ్ కిట్ల ద్వారా టెస్టులు నిర్వహించగా.. అందరికీ నెగిటివ్‌గా తేలింది. ఈ మేరకు మరో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించనున్నట్లు పావని తల్లిదండ్రులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
బురద గుంటలో ఏనుగు
కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో బురద గుంటలో చిక్కుకుపోయిన ఓ ఆడ ఏనుగును పార్కు సిబ్బంది రక్షించారు. మోలెయూర్ పరిధిలో శనివారం(మే 15న) ఈ ఘటన చోటు చేసుకుంది. బురద గుంట నుంచి బయటకు వచ్చేందుకు ఏనుగు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంలో జాతీయ పార్కు సిబ్బంది రంగంలోకి దిగారు. జేసీబీ సాయంతో ఏనుగును బురద గుంట నుంచి పైకి తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బందీపూర్ టైగర్ రిజర్వ్ అధికారులు ట్విట్టర్‌లో ఉంచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.