జాతీయ నేర గణాంకాల మండలి-2017 నివేదిక పలు నేరాలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. మొత్తం 50లక్షల 7వేలకు పైగా ఐపీసీ కేసులు 19లక్షల 44వేలకు పైగా స్థానిక చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. 2016తో పోలిస్తే కేసుల నమోదులో 3.6శాతం మేర పెరుగుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా 2017లో మహిళలపై నేరాలు పెరిగినట్లు జాతీయ నేర గణాంకాల మండలి తేల్చింది.
తెలంగాణే టాప్
తెలంగాణలోనూ 2016తో పోలిస్తే 2017లో పెరిగాయి. 2015లో 15425, 2016లో 15374 కేసులు నమోదు కాగా 2017లో మాత్రం 17521 కేసులు నమోదు కావడం గమనార్హం. మహిళలపై నేరాల విషయంలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 56వేల కేసులు ఆ రాష్ట్రంలో నమోదయ్యాయి. పని ప్రదేశంలో మహిళలపై వేదింపుల విషయంలో తెలంగాణ టాప్లో ఉంది. దేశవ్యాప్తంగా 449 కేసులు నమోదు కాగా తెలంగాణలో 123 కేసులు నమోదయ్యాయి. మహిళలను అక్రమ రవాణా చేసి అనంతరం వ్యభిచార వృత్తికి దింపుతున్న ఘటనల్లో 184 కేసులతో తెలంగాణ మూడో స్థానంలో ఉంది.