ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పాల శ్రీనివాస్ తెలిపారు. పర్యాటక శాఖలో ఉన్న 500 మంది మహిళా, పురుష ఉద్యోగులతో పాటు తాను కూడా చేనేత వస్త్రాలు ధరిస్తానని చెప్పారు. వారం, పది రోజుల్లో కార్యరూపానికి తీసుకురానున్నట్టు వెల్లడించారు.
'ప్రతి సోమవారం చేనేత వస్త్రాలనే ధరిస్తాం' - తెలంగాణ టూరిజం వార్తలు
చేనేత కార్మికులకు తమవంతు సాయం అందించేందుకు రాష్ట్ర పర్యాటకశాఖ ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పాల శ్రీనివాస్ తెలిపారు.
'ఇక నుంచి ప్రతి సోమవారం చేనేత వస్త్రాలనే ధరిస్తాం'
రాష్ట్రంలోని 33జిల్లాలను టూరిజం హబ్‌గా తీర్చిదిద్ది... అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చేందుకు కృషి చేస్తానని ఉప్పాల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెరాస విద్యార్థి విభాగం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను... హైదరాబాద్ హైదర్‌గూడ పర్యాటక భవన్‌లోని తన కార్యాలయంలో ఉప్పాల ఆవిష్కరించారు.
ఇదీ చూడండి:రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా... మరిన్ని కఠిన చర్యలు