తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్ష ప్రభావ ప్రాంతాల్లో ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలి: రఘుమారెడ్డి - సీఎండీ రఘుమా రెడ్డి సమీక్ష వార్తలు హైదరాబాద్​

విద్యుత్ శాఖ సూపరింటెండెంట్​ ఇంజినీర్, చీఫ్ జనరల్ మేనేజర్లతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్ష ప్రభావం గల రాజేంద్రనగర్, సైబర్ సిటీ, సెంట్రల్, సౌత్, బంజారా హిల్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, సరూర్ నగర్ సర్కిళ్ల ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎండీ సూచించారు.

వర్ష ప్రభావ ప్రాంతాల్లో ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలి: రఘుమారెడ్డి
వర్ష ప్రభావ ప్రాంతాల్లో ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలి: రఘుమారెడ్డి

By

Published : Oct 9, 2020, 9:33 PM IST

గ్రేటర్ హైదరాబాద్​లో అకాల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ సూపరింటెండెంట్​ ఇంజినీర్, చీఫ్ జనరల్ మేనేజర్లతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు.

భారీ వర్ష ప్రభావం గల రాజేంద్రనగర్, సైబర్ సిటీ, సెంట్రల్, సౌత్, బంజారా హిల్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, సరూర్ నగర్ సర్కిళ్ల ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎండీ సూచించారు. వర్షం నీరు నిల్వ ఉన్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే విద్యుత్ సంస్థకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఓల్టేజ్​లో హెచ్చు తగ్గులు ఉన్నా... విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే 1912/100/ స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్​తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లు 7382072104, 7382072106,7382071574కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

ఇదీ చదవండి:'ప్రస్తుతం ఉన్న ఛార్జీల ప్రకారమే బిల్లులు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details