తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్రాభివృద్ధిలో ఎన్జీవో ఉద్యోగుల పాత్ర కీలకం' - హోంమంత్రి మహమూద్​ అలీ వార్తలు

దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో ఉంచడంలో రాష్ట్ర ఎన్జీవో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. నాంపల్లి గృహకల్పలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ అధ్యక్షతన జిల్లా శాఖ డైరీ, క్యాలెండర్​ను హోంమంత్రి ఆవిష్కరించారు.

'రాష్ట్రాభివృద్ధిలో ఎన్జీవో ఉద్యోగుల పాత్ర కీలకం'
'రాష్ట్రాభివృద్ధిలో ఎన్జీవో ఉద్యోగుల పాత్ర కీలకం'

By

Published : Jan 10, 2021, 9:16 AM IST

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్జీవో ఉద్యోగులు కీలకంగా వ్యవహరించారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి గృహకల్పనలో జరిగిన కార్యక్రమంలో టీఎన్జీవో నూతన సంవత్సర డైరీ, క్యాలండర్​ను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తున్నట్లు పేర్కొన్నారు.

వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 15 మంది ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ మహ్మద్ సలీం, రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ మసీఉల్లాఖాన్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఆయాచితం శ్రీధర్​తో పాటు టీఎన్జీవో కేంద్ర సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది కౌన్సెలింగ్

ABOUT THE AUTHOR

...view details