వైద్య విద్యార్థులు పుస్తకాలను వల్లె వేయటంతోపాటు... చుట్టు పక్క పరిస్థితులను అవలోకనం చేసుకుని మసలుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. హైదరాబాద్ సైబర్ కన్వెన్షన్ సెంటర్లో 6వ ఐడీఏ - రాష్ట్ర డెంటల్ కాన్ఫరెన్స్‌ను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణతోనే.. బంగారు తెలంగాణ సాధ్యమని ఈటల పేర్కొన్నారు.
'ఆరోగ్య తెలంగాణతోనే.. బంగారు తెలంగాణ సాధ్యం' - minister etela rajender
ఆరోగ్య తెలంగాణతోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సైబర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన 6వ ఐడీఏ - తెలంగాణ రాష్ట్ర డెంటల్ కాన్ఫరెన్సును ప్రారంభించారు.
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
ఈ కార్యక్రమానికి డాక్టర్ కరుణాకర్ రెడ్డి, డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి, డాక్టర్ కేవీ త్రినాథ్ రెడ్డి, పలువురు ప్రముఖ వైద్యులు అతిథులుగా హాజరయ్యారు. డెంటల్ విద్య అభ్యసిస్తున్న పలువురు వైద్యవిద్యార్థులు కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.