తెలంగాణ

telangana

ETV Bharat / state

'తొలి కరోనా మృతి నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ'

కరోనా వైరస్​ను ఎదుర్కోవడానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధంగా ఉందని ఆ శాఖ సంచాలకుడు డాక్టర్​ శ్రీనివాస్​ రావు తెలిపారు. తొలి కరోనా మరణానికి హైదరాబాద్​తో సంబంధం ఉండటం వల్ల అన్ని శాఖలను అప్రమత్తం చేశామని వెల్లడించారు.

telangana state health department director srinivas rao on corona virus
'తొలి కరోనా మృతి నేపథ్యంలో తెలంగాణ మరింత అప్రమత్తం'

By

Published : Mar 13, 2020, 7:11 PM IST

దేశంలో నమోదైన తొలి కరోనా మరణంతో హైదరాబాద్​కు సంబంధం ఉండటం వల్ల రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలన్నింటిని అప్రమత్తం చేశామని ఆ శాఖ సంచాలకుడు డాక్టర్​ శ్రీనివాస్​ అన్నారు. మృతుడితో సంబంధం ఉన్న వారందర్నీ గుర్తించామని, వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

విదేశాల నుంచి వస్తున్న వారందరిని పరిశీలించడానికి ప్రత్యేకంగా ఓ కాల్​సెంటర్​ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 70 మంది సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారని డాక్టర్​ శ్రీనివాస్​ రావు వెల్లడించారు. కరోనా లక్షణాలున్న రోగుల విషయంలో ప్రైవేట్​ ఆసుపత్రులను మరోసారి అప్రమత్తం చేశామంటోన్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్​ శ్రీనివాస్​ రావుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

'తొలి కరోనా మృతి నేపథ్యంలో తెలంగాణ మరింత అప్రమత్తం'

ABOUT THE AUTHOR

...view details