వివిధ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. శాసనసభ సమావేశాల సన్నద్ధత, రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల అమలుపై చర్చించారు. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల అమలుపై శాఖల వారీగా వివరాలను మార్చి 4లోగా సాధారణ పరిపాలనా శాఖకు అందించాలని అధికారులను ఆదేశించారు. జీఏడీ, ఆర్థికశాఖల పరిశీలనలకు అనుగుణంగా పోస్టుల వివరాలివ్వాలన్నారు. బిజినెస్ రూల్స్ ప్రకారం నివేదికలపై తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు.
శాసనసభ సమావేశాల సన్నద్ధతపై సీఎస్ సమీక్ష - CS Somesh Kumar Officers Review Meeting
శాసనసభ సమావేశాల సన్నద్ధత, రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల అమలుపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల అమలుపై శాఖల వారీగా వివరాలివ్వాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.
CS Somesh Kumar
శాసనసభ సమావేశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమాధానాలు పంపాలని సూచించారు. కాగ్ నివేదికలోని పెండింగ్ ఆడిట్ పేరాల సమాధానాల సమర్పణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బడ్జెట్ పద్దులు, ఔట్ కం బడ్జెట్‌లో సమగ్ర వివరాలు ఉండాలని తెలిపారు. ఆయా శాఖలకు సంబంధించిన బ్రీఫ్ ప్రొఫైల్స్ రూపొందించాలని సీఎస్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి :సీఎంకు బాధితుల సందేశం..పోలీసుల పరిష్కారం..