ప్రగతి భవన్ వేదికగా సుదీర్ఘంగా కొనసాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన భేటీలో నూతన పురపాలక చట్టం బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 1965 తెలంగాణ మున్సిపల్ చట్టం, 1994 తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం స్థానంలో నూతన బిల్లు రూపొందించారు. కొత్త చట్టం కోసం రేపట్నుంచి శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు పురపాలకశాఖ సిద్ధంచేసిన ముసాయిదా బిల్లుకు న్యాయశాఖ ఆమోదం కూడా లభించింది. కేబినేట్ సమావేశం సుమారు ఐదు గంటలపాటు కొనసాగింది.
ముగిసిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం - రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం
ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన సుదీర్ఘంగా కొనసాగిన కేబినేట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కొత్త పురపాలక చట్టం బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అలాగే పలు అంశాలపై చర్చించారు.
రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితి 57 ఏళ్లకు తగ్గింపు అమలుకు పచ్చజెండా ఊపారు. లబ్ధిదారుల జాబితా రూపొందించి పింఛను అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ తేదీని తొలగించాలని నిర్ణయించారు. ఈనెల 20న నియోజకవర్గాల వారీగా పింఛను ప్రొసీడింగ్స్ అందించాలని కేబినేట్ సూచించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇవీ చూడండి:కోతుల నుంచి తప్పించుకోవడానికి ఏం చేశాడంటే?