తెలంగాణ

telangana

ఖతార్ వేడుకల్లో తెలంగాణ పాటలు

By

Published : Nov 23, 2019, 10:00 PM IST

ఇండియా ఖతార్​ ఇయర్​ ఆఫ్​ కల్చర్​ 2019 వేడుకల్లో భాగంగా ఖతార్​లోని ప్రవాస భారతీయులు తెలంగాణ జానపద పాటలతో సందడి చేశారు. పిల్లలు, మహిళలు హుషారుగా నృత్యాలు చేస్తూ అలరించారు.

ఖతార్ వేడుకల్లో తెలంగాణ పాటలు

ఖతార్​లోని కరామ అవర్నెస్​ పార్క్​ ఆధ్వర్యంలో భారత ఖతార్​ ఇయర్​ ఆఫ్​ కల్చర్​ 2019 వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. మ్యూజియం ఆఫ్​ ఇస్లామిక్​ ఆర్ట్​లో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులు తెలంగాణ జానపద పాటలకు నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు.

చిన్నారులు, మహిళలు చేసిన ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు. ఈ వేడుకలు జనవరి 18 వరకు ఖతార్​లోని పలు ప్రదేశాల్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఇండియన్ కల్చరల్ సెంటర్, తెలంగాణ ప్రజా సమితి సభ్యులు పాల్గొన్నారు.

ఖతార్ వేడుకల్లో తెలంగాణ పాటలు

ఇదీ చూడండి : విద్యార్థినిపై అత్యాచారం చేసిన ప్రిన్సిపల్

ABOUT THE AUTHOR

...view details