సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. మరోసారి సీఎంపై, కవితపై విమర్శలు చేస్తే.. సహించేది లేదని యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్‌రెడ్డి హెచ్చరించారు.
TMU: ఎమ్మెల్సీ కవిత అధ్యక్షురాలిగా ఉంటే తప్పేంటి? - సీఎం కేసీఆర్ తాజా వార్తలు
మాజీమంత్రి ఈటల రాజేందర్‌పై తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ విరుచుకుపడింది. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. ఎమ్మెల్సీ కవిత టీఎంయూకు గౌరవ అధ్యక్షురాలిగా పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించింది.
TMU
ఈటల రాజేందర్ కేవలం తన ఆస్తులు కాపాడుకోవడం కోసం.. వారి పిల్లల భవిష్యత్, రాజకీయ ప్రయోజనాల కోసమే భాజపాలో చేరుతున్నారని ఆరోపించారు. ఉద్యోగ సంఘాలు ఎవరినైనా గౌరవ అధ్యక్షులుగా పెట్టుకునే హక్కు ఉందని.. ఎమ్మెల్సీ కవిత టీఎంయూకు గౌరవ అధ్యక్షురాలిగా పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నేతలుగా తాము కవితను కలిసి గౌరవ అధ్యక్షురాలు ఉండాలనే పలుమార్లు విజ్ఞప్తి చేశామని అన్నారు. ఏ ఆత్మగౌరవంతో భాజపాలోకి వెళ్తున్నారో చెప్పాలన్నారు.