లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమేనా...? - HYDERABAD
లోక్‌సభ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. త్వరలో ఎన్నికల ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో సిబ్బంది, యంత్రాల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల అధికారి సునీల్ అరోరా సమీక్షించారు.
ఎన్నికలపై అధికారుల సమీక్ష
ఓటర్ల జాబితా, శాంతి భద్రతలు, సిబ్బంది, ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలపై అధికారులతో చర్చించారు. లోక్‌సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ఉన్నతాధికారులు సునీల్ అరోరాకు వివరించారు. త్వరలోనే రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి బృందం రానున్నట్లు తెలిపారు. దిల్లీలో ఈనెల 21న మరోసారి శిక్షణ కార్యక్రమం ఉంటుంది. శిక్షణలో ఉత్తీర్ణులైన అధికారులే ఎన్నికల్లో పనిచేయడానికి అర్హులని స్పష్టం చేశారు.