ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మెట్టుదిగి ఆర్టీసీ సమ్మెను విరమింప చేయాలని తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం కోరింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సామ వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలపై హైద్రాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో భవిష్యత్ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. కార్మికులు ఎవరు ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని... ఈ విషయంలో ప్రతిపక్షాలు వారి రాజకీయ లబ్ది కొరకు వాడుకోవద్దని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కార్మికుల సమస్యలను... ప్రజల అసౌకర్యాలను గుర్తించి సమస్య పరిష్కారానికి మార్గం చూడాలన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లిన వారు తిరిగి స్వరాష్ట్రానికి రావాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. కానీ దానికంటే ముందు రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో 75 శాతం స్థానికులకు రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కార్మికులకే మా సంపూర్ణ మద్దతు: టీపీయూఎస్ - టీఎస్ఆర్టీసీ
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ముఖ్యమంత్రి కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలని సంఘం నేతలు కోరారు. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో 75 శాతం స్థానికులకు రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కార్మికులకే మా సంపూర్ణ మద్దతు: టీపీయూఎస్