రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అండగా ఉంటూ.. ఆపత్కాలంలో నేనున్నా అనే ధైర్యం చెప్పే నాయకుడు కేటీఆర్ అని, రాష్ట్ర ప్రైవేట్ ఉద్యోగ సంఘానికి మంత్రి ప్రతి సందర్భంలో ఆయన వెన్నుదన్నుగా నిలుస్తున్నారని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్లో రాష్ట్ర ప్రైవేట్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రక్తదాన శిబిరం - Blood donation on ktr birth day
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. తెలంగాణ భవన్లో ప్రైవేటు ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రక్తదాన శిబిరం
రక్తదానం వల్ల ఒకరి ప్రాణాలు కాపాడగల్గుతామని, అంతకు మించిన విలువైన దానం మరొకటి లేదని మేయర్ అన్నారు. అనంతరం కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రూపొందించిన పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ప్రైవేటు ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు సామ వెంకట్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'కరోనాను కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం'