రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఎత్తేయడంతో.. సీజ్ చేసిన వాహనాలను విడుదల చేసేందుకు తెలంగాణ పోలీసు యంత్రాంగం(Telangana police department) సిద్ధమైంది. జరిమానాలు చెల్లించిన వారి వాహనాలు తిరిగి ఇచ్చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి(DGP Mahender Reddy).. జిల్లా ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. మే 12 వ తేదీ నుంచి జూన్ 19వ తేదీ వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగింది. లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వేల కొద్ది వాహనాలను పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
లాక్‌డౌన్ సమయంలో వాహనాదారులపై సాధారణ కేసు నమోదైతే, జరిమానా విధించి వాహనాలను వెంటనే వదిలేశారు. న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ ప్రవేశపెట్టే కేసులు నమోదు చేసిన వాహనాలను మాత్రం జప్తు చేశారు. ఇన్ని రోజులు ఆయా వాహనాలను పోలీస్ స్టేషన్లలోని ప్రాంగణాల్లోనే ఉంచారు.