రాష్ట్ర వ్యాప్తంగా 748 సహకార సంఘాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సాయంత్రానికల్లా బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం తెలనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 157 సహకార సంఘాల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. అలాగే మొత్తం 11,654 వార్డులకు గాను 5,406 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
7 వార్డులు గెలిస్తే ఛైర్మన్ పదవి...
ఒక్కో సంఘంలో 12 నుంచి 13 చొప్పున వార్డులున్నాయి. వీటినే ప్యాక్స్ ప్రాదేశిక నియోజకవర్గం అంటారు. ఒక సంఘంలో కనీసం 7 వార్డులు గెలిస్తే ఛైర్మన్ పదవి దక్కుతుంది. వార్డు సభ్యులుగా ఎన్నికైన వారు... రేపు, ఎల్లుండి పీఏసీఎస్ ఛైర్మన్లను ఎన్నుకుంటారు. ఈ ఛైర్మన్ల నుంచి ‘జిల్లా కేంద్ర సహకార బ్యాంకు’(డీసీసీబీ), జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య(డీసీఎంఎస్), రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య(మార్క్‌ఫెడ్)లకు పాలకవర్గాలను ఎన్నుకుంటారు. ప్యాక్స్ ఛైర్మన్ల ఎన్నికలు పూర్తయ్యాక ఈనెల 17 లేదా 18న డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని అధికారులు చెప్పారు.
ఇవీ చూడండి:శంషాబాద్లో 1100 గ్రాముల బంగారం పట్టివేత