తెలంగాణ

telangana

By

Published : Aug 16, 2022, 8:59 AM IST

ETV Bharat / state

Latest Telangana News టాప్​న్యూస్​ 9AM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

Latest Telangana News
Latest Telangana News

  • ఇవాళ వికారాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్

CM KCR Visits Vikarabad ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పలు చోట్ల పర్యటిస్తూ బిజీబిజీగా ఉండనున్నారు. ఉదయం 11 గంటలకు కేసీఆర్ హైదరాబాద్ అబిడ్స్‌లో పర్యటించనున్నారు. అక్కడ సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లా కేంద్రానికి బయలుదేరుతారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

  • హడావుడిగా పాక్​లో ల్యాండైన హైదరాబాద్‌ విమానం

Flight landed in Karachi హైదరాబాద్ నుంచి పన్నెండు మంది ప్రయాణికులతో బయలుదేరిన ఒక అద్దె విమానం పాకిస్థాన్​లోని కరాచీ విమానాశ్రయంలో దిగింది. దీనికి కారణాలేంటన్నది స్పష్టంకాలేదని పాక్‌ వర్గాలు తెలిపాయి.

  • ఎంసెట్‌లో ఇతర బోర్డు విద్యార్థులదే ఆధిక్యం

TS EAMCET: ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో తొలి 500 ర్యాంకుల్లో ఇతర బోర్డుల విద్యార్థులే పైచేయి సాధించారు. తొలి 500 ర్యాంకులను విశ్లేషించగా వారిలో ఏపీ ఇంటర్‌బోర్డు విద్యార్థులు 213 మంది, సీబీఎస్‌ఈ విద్యార్థులు 47 మంది ఉన్నట్టు తేలింది. తెలంగాణ ఇంటర్‌బోర్డు విద్యార్థులు 240 మంది చోటు దక్కించుకున్నారు.

  • నేతాజీ మరణం మిస్టరీని ఛేదించండి

జపాన్‌ రాజధాని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉంచిన నేతాజీ అస్థికలకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు ఆయన కుమార్తె అనితా బోస్. మృతిపై ఇప్పటికీ కొందరికి ఉన్న అనుమానాలకు డీఎన్‌ఏ పరీక్ష సమాధానాలు ఇస్తుందన్నారు.

  • కలెక్టర్ హత్య కేసులో ఆ నేతకు జీవితఖైదు

కలెక్టర్‌ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ నేత.. జైలుకు బదులు ఇంట్లో ఉన్న ఫొటోలు బిహార్​లో రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై భాజపా నేతలు విమర్శలకు దిగారు. ఆర్జేడీ- జేడీయూల నూతన ప్రభుత్వంతో రాష్ట్రంలో 'జంగల్‌ రాజ్‌' తిరిగొచ్చిందంటూ ఆరోపణలు చేస్తున్నారు.

  • మరో ఆరు నెలల్లో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే టీకా

వచ్చే ఆరు నెలల్లోపే ఒమిక్రాన్‌ వేరియంట్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ తీసుకురానున్నట్లు సీరం ఇన్​స్టిట్యూట్ సీఈఓ అదర్‌ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణమని నివేదికలు వస్తోన్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • ఆ దేశాల సంగతి చూద్దాం అంటూ పుతిన్, కిమ్​ ప్రేమ లేఖలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పరస్పరం లేఖలు రాసుకున్నారు. శత్రు దేశాల బెదిరింపులు, రెచ్చగొట్టే చర్యలను ఉమ్మడిగా ఎదుర్కొందామని తీర్మానించారు.

  • చెన్నైతో జడేజా ఇన్నింగ్స్‌ ముగిసినట్లే

గత ఐపీఎల్‌లో చివరి మ్యాచ్‌లకు అందుబాటులో లేని జడేజా.. సామాజిక మాధ్యమాల్లో గతంలో చెన్నై జట్టు గురించి చేసిన పోస్టులను తొలగించాడు. దీంతో సీఎస్కేకు అతడు దూరం అవుతున్నాడన్న ఊహాగానాలు వినిపించాయి. ఆటగాళ్ల మధ్య బంధాన్ని దృఢపరచడానికి సీఎస్కే నిర్వహించే కార్యక్రమాలకు కూడా హాజరు కాకపోవడం జడేజా జట్టును వీడనున్నాడన్న వార్తలకు బలాన్ని అందిస్తోంది.

  • త్వరలోనే మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్​యూవీ

మహీంద్రా విద్యుత్​ ఎస్​యూవీ సిరీస్​లో తొలి వాహనం 2024 ఆఖరుకు విడుదలవుతుందని వెల్లడించారు ఆ సంస్థ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. మొత్తంమీద 2024-26 సంవత్సరాలలో 4 విద్యుత్తు ఎస్‌యూవీలు రోడ్లపైకి రావొచ్చని తెలిపారు.

  • రవితేజ సినిమా నుంచి జింతాక్‌ పాట, ఏప్రిల్‌లో టైగర్‌ 3

మాస్​ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ధమాకా చిత్రం నుంచి కొత్త పాటను విడుదల చేయనున్నారు. జింతాక్‌ అంటూ సాగే ఈ సినిమాలోని పాటను ఈ నెల 18న విడుదల చేయనున్నట్టు చిత్రవర్గాలు తెలిపాయి. మరోవైపు, సల్మాన్‌ఖాన్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం టైగర్‌ 3. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 21న విడుదలవుతున్నట్టు సల్మాన్‌ సోమవారం స్వయంగా ప్రకటించారు. ​

ABOUT THE AUTHOR

...view details