నూతన రెవెన్యూ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం - రెవెన్యూ బిల్లుకు శాసనసభ ఆమోదం
18:03 September 11
నూతన రెవెన్యూ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం
నూతన రెవెన్యూ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎలాంటి సవరణలు లేకుండానే బిల్లుకు ఆమోదం తెలిపింది. తెలంగాణ గ్రామ అధికారుల పదవుల రద్దు బిల్లు-2020, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, పురపాలక నియమాల సవరణ బిల్లుకు ఆమోదించింది.
రెవెన్యూ బిల్లు ఆమోదంతో సీఎం కేసీఆర్‌ను మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించారు. శాసనసభలో కేసీఆర్ విజయచిహ్నం ప్రదర్శించారు. శాసనసభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.
ఇదీ చూడండి :'రేపటి నుంచే వక్ఫ్ భూముల్లో లావాదేవీలు నిషేధం'