హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ, కొరియా కల్చరల్ ఫెస్ట్ నిర్వహించారు. తెలంగాణ, కొరియా సాంస్కృతికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు తెలంగాణ, కొరియా కల్చరల్ ఫెస్ట్ పేరిట ఆల్ ఇండియా కాపోప్ కాంటెస్ట్ హైదరాబాద్ రీజనల్ రౌండ్ పోటీలను నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిని తెలియజేస్తూ.... జానపద నృత్యాలు, బోనాల జాతర వంటి నృత్యాలు ప్రదర్శించారు. కొరియా సాంస్కృతి ప్రాధాన్యతను తెలియజేస్తూ.... ప్రదర్శించిన పాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఇందులో దాదాపు 71 మంది విద్యార్థులు, 25 గ్రూప్‌లుగా పోటీపడ్డారు. ఇందులో విజేతలైన వారికి దిల్లీలో జరిగే ఫైనల్ పోటీల్లో అవకాశం కల్పిస్తామని నిర్వహకులు తెలిపారు.
తెలంగాణ, కొరియా కల్చర్ ఫెస్ట్ - ravindrabharathi
తెలంగాణ, కొరియా కల్చరల్ ఫెస్ట్ ఆద్యంతం వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ సాంస్కృతిక శాఖ, హైదరాబాద్ కొరియా సాంస్కృతిక సెంటర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
బోనాలు