తెలంగాణ జాగృతి సభ్యులమంటూ పైసలు వసూలు చేస్తున్న ఘటన హైదరాబాద్ చైతన్యపురిలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న అయాన్ ఎస్.ఐ, కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్లోకి ప్రవేశించి... నిర్వాహకుడు అన్వర్‌ను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానికి అన్వర్ నిరాకరించడం వల్ల... తీవ్ర పరుష పదజాలంతో దూషించి దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆఫీసులోని సామగ్రిని ధ్వంసం చేశారు. విద్యార్థులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లి... ఫిర్యాదు చేశారు. తనపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్వర్ పోలీసులను కోరారు.
తెలంగాణ జాగృతి పేరుతో డబ్బులు వసూల్.... - money collect
తెలంగాణ జాగృతి సభ్యులమంటూ డబ్బులు వసూలు చేస్తున్న ఘటన హైదరాబాద్ చైతన్యపురిలో చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ యాజమానిని అడిగినంత ఇవ్వకపోడం వల్ల ఏకంగా అతనిపై దాడి చేసి కలకలం సృష్టించారు.
తెలంగాణ జాగృతి